కేసీఆర్‌ను అరెస్ట్ చేయబోమని చెప్పడం దేనికి సంకేతం: ఏలేటి

కాళేశ్వరంపై పీసీఘోష్ ఇచ్చిన నివేదిక పై బీజేపీ శాసనసభపక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ రిపోర్టు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఇచ్చినట్టు ఉందన్నారు. కేసీఆర్ అవినీతిపై ప్రస్తావన లేకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోందని ఆయన అన్నారు

కేసీఆర్‌ను అరెస్ట్ చేయబోమని చెప్పడం దేనికి సంకేతం: ఏలేటి

విధాత: కాళేశ్వరంపై పీసీఘోష్ ఇచ్చిన నివేదిక పై బీజేపీ శాసనసభపక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఈ రిపోర్టు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఇచ్చినట్టు ఉందన్నారు. కేసీఆర్ అవినీతిపై ప్రస్తావన లేకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై ప్రస్తావన లేకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు. అవినీతిపై విచారణ చేయాలని ప్రభుత్వం చెప్పలేదని ఆయన అన్నారు.కాళేశ్వరం రిపోర్టుపై ఆదివారం నాడు అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ తరపున ఆయన పాల్గొన్నారు. ఈ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారో సీఎం సమాధానం చెప్పాలన్నారు. హడావుడిగా సమావేశాలు ఎందుకు పెట్టారో సీఎం జవాబు చెప్పాలని ఆయన కోరారు. 660 పేజీల నివేదికను ప్రవేశపెట్టి వెంటనే చర్చించడం సరైంది కాదని ఆయన అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవతవకలు, లోపాలకు కారణమైన దోషులను శిక్షించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన ఆరోపించారు. రాజకీయ ఉద్దేశాలతోనే ఈ చర్చ చేపట్టారని భావిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై విచారించి జైళ్లకు పంపుతామని గతంలో కాంగ్రెస్ నాయకులు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 21 నెలలు దాటినా ఒక్కరిపై కేసు పెట్టలేదని… ఒక్కరిని కూడా జైలుకు పంపలేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ ను అరెస్ట్ చేయమని సీఎం చెప్పడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. లక్ష కోట్లు దుర్వినియోగం చేసినా ఎందుకు చర్యలు లేవో జవాబు చెప్పాలన్నారు. నేరం జరిగిందని అంటున్నారని… కేసులు పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేరాలపై సభలో చర్చ జరపడం దేశంలో ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. నేరం చేసిన అంశం అన్నారు.. దర్యాప్తు ఎందుకు చేయించలేదని ఆయన ప్రశ్నించారు. నేరం చేసిన అంశాన్ని చట్టసభలో చర్చించడం ఎలా సబబో చెప్పాలని అన్నారు.