సర్పంచ్ ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కేవీటీ

తెలంగాణ గ్రామ పంచాయితీ సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా త్రిపురారం మండలం అంజనపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ కందుల వెంకటేశ్వర్లు (కేవీటీ) ఎన్నికయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఫోరం రాష్ట్ర కమిటీ సమావేశంలో అంజనపల్లి సర్పంచ్ కందుల వెంకటేశ్వర్లును రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సౌదాని భూమన్న యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు.

విధాత : తెలంగాణ గ్రామ పంచాయితీ సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా త్రిపురారం మండలం అంజనపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ కందుల వెంకటేశ్వర్లు (కేవీటీ) ఎన్నికయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఫోరం రాష్ట్ర కమిటీ సమావేశంలో అంజనపల్లి సర్పంచ్ కందుల వెంకటేశ్వర్లు ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సౌదాని భూమన్న యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు.

అంజనపల్లి సర్పంచ్ కేవీటీ సీనియర్ జర్నలిస్టుగా ప్రజాసమస్యలపై నిష్పక్షపాతంగా వార్త కథనాలు అందించి ప్రజల మన్ననలు పొందారు. ఈ క్రమంలో సామాజికంగా రాజకీయంగా ప్రజా సమస్యలపై ఉద్యమాలపై జనహిత స్పృహ కలిగిన కేవిటీ ని రాష్ట్ర కమిటీకి ఎంపిక చేయడం పట్ల సహచర జర్నలిస్టులు, సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్బంగా కేవీటీ మాట్లాడుతూ తనను గుర్తించి సర్పంచుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనను నిరంతరం ప్రోత్సహిస్తూ.. ప్రజా సేవ చేసేందుకు సహకరిస్తున్న మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎంపీ రఘువీర్ రెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు జయవీర్ రెడ్డి లకు, సర్పంచుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు సౌధాని భూమన్న యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఆరంభంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. సర్పంచుల సమస్యలను ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంతేగాక సర్పంచ్ ల ఫోరం బలోపేతానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని కేవీటీ హామీ ఇచ్చారు.

Latest News