Ponguleti Srinivasa Reddy | మంత్రి పొంగులేటికి ఏపీ ప్రభుత్వం నోటీసులు
తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకీ ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మంత్రికి చెందిన రాఘవ కనస్ట్రక్చన్ కంపెనీ భుగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194 కోట్లతో టెండర్ దక్కించుకుంది

విధాత, హైదరాబాద్ : తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకీ ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మంత్రికి చెందిన రాఘవ కనస్ట్రక్చన్ కంపెనీ భుగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.1194 కోట్లతో టెండర్ దక్కించుకుంది. అయితే టెండర్ దక్కించుకున్న సంస్థ ఏడాది గడిచినా ఇంకా పనులు ప్రారంభించక పోవడంతో ఏపీఈపీడీసీఎల్ నోటీసులు ఇచ్చింది. నెల లోపు వెంటనే పనులు ప్రారంభించాలని తెలిపింది. ఇచ్చిన గడువులోగా పనులు ప్రారంబించక పోతే కంపెనీపై చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన పనులు కేంద్రం ఇచ్చిన గడువులోగా పూర్తి కాకపోతే.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్ నిలిచిపోతుందని ఈ సందర్భంగా ఏపీ అధికారులు గుర్తు చేశారు.