విధాత, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తమకు ఎనిమిది సీట్లు ఇవ్వాలని కమ్మ నాయకులు కాంగ్రెస్ పార్టీని కోరారు. ఈ మేరకు తెలంగాణ కమ్మ పొలిటికల్ యునైటెడ్ ప్లాట్‌ఫామ్ ప్రతినిది బృందం ఢిల్లీలో ఏఐసీసీ నేతలను కలిసింది.
రాష్ట్రంలో 30 నియోజకవర్గాలలో కమ్మ ఓట్ల ప్రభావం ఉందని, గెలుపులో కీలక పాత్ర వహిస్తారని కమ్మ ప్రతినిధులు ఏ ఐసీసీ నేతలను కోరారు. ముఖ్యంగా ఖమ్మం, పాలేరు, కోదాడ, మల్కాజిగిరి, బాన్సువాడ, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సిర్పూర్, కాగజ్‌నగర్ టికెట్లను ఇవ్వాలని కోరినట్లు తెలంగాణ కమ్మ పొలిటికల్ యునైటెడ్ ప్లాట్‌ఫామ్ నాయకుడు జి.విద్యాసాగర్ తెలిపారు.