కవితకు మళ్లీ బెయిల్‌ నిరాకరించిన రౌస్‌ అవెన్యూ కోర్టు

బీఆరెస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టులో మంగళవారం చుక్కెదురైంది. ప్రస్తుతం రద్దయిన ఢిల్లీ లిక్కర్‌ పాలసీ 2021-22కు సంబంధించి ఈడీ, సీబీఐ కేసులలో ఆమె పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను న్యాయమూర్తి కావేరీ బవేజా తిరస్కరించారు.

కవితకు మళ్లీ బెయిల్‌ నిరాకరించిన రౌస్‌ అవెన్యూ కోర్టు

న్యూఢిల్లీ : బీఆరెస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్‌ అవెన్యూ కోర్టులో సోమ‌వారం చుక్కెదురైంది. ప్రస్తుతం రద్దయిన ఢిల్లీ లిక్కర్‌ పాలసీ 2021-22కు సంబంధించి ఈడీ, సీబీఐ కేసులలో ఆమె పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను న్యాయమూర్తి కావేరీ బవేజా తిరస్కరించారు. ఆమె జ్యడిషియల్‌ కస్టడీ మే 7వ తేదీతో ముగియనున్నది.

లిక్కర్‌ పాలసీ కేసులో కవితను ఈడీ మార్చి 15న అరెస్టు చేసింది. మార్చి 23 వరకు ఆమెను సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆమెను ఏప్రిల్‌ 11న అరెస్టు చేసిన సీబీఐ.. తీహార్‌ జైలుకు తరలించింది. ఏప్రిల్‌ 9 తన కుమారుడి పరీక్షల నిమిత్తం బెయిల్‌ మంజూరు చేయాలని ఢిల్లీ కోర్టులో ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది.

ఇదే కేసులో కవితతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా పలువురు వ్యాపారవేత్తలు, ఇతరులను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్టు చేశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తనపై రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారన్న కేజ్రీవాల్‌ వాదనలను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు ఆయనను జైలు నుంచి విడుదల చేసేందుకు ఏప్రిల్‌ 9న నిరాకరించింది. అయితే.. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలన్న అభ్యర్థనపై మే 7వ తేదీన వాదనలు వినేందుకు గత శుక్రవారం సుప్రీంకోర్టు అంగీకరించింది.