బండి భగీరథ్ పరారీ…పోస్టర్ల కలకలం

మైనర్ బాలికపై అఘాయిత్యం చేశాడంటూ ఫోక్సో కేసు అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పరారీలో అంటూ హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో భారీ ఎత్తున పోస్టర్లు వెలియడం కలకలం రేపింది. నిన్న రాత్రి శేరిలింగంపల్లిలో బండి భగీరథ్ ABSCONDING అంటూ పోస్టర్లు వేశారు. ఇది బండి సంజయ్ రాజకీయ ప్రత్యర్థుల పనిగా బండి అనుచరులు భావిస్తున్నారు.

బండి భగీరథ్ పరారీ…పోస్టర్ల కలకలం

విధాత,హైదరాబాద్: మైనర్ బాలికపై అఘాయిత్యం చేశాడంటూ ఫోక్సో కేసు అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పరారీలో అంటూ హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో భారీ ఎత్తున పోస్టర్లు వెలియడం కలకలం రేపింది. నిన్న రాత్రి శేరిలింగంపల్లిలో బండి భగీరథ్ ABSCONDING అంటూ పోస్టర్లు వేశారు. ఇది బండి సంజయ్ రాజకీయ ప్రత్యర్థుల పనిగా బండి అనుచరులు భావిస్తున్నారు.

అయితే జీహెచ్ఎంసీ సిబ్బంది బుధవారం ఉదయం నుంచి బండి భగీరథ్ పరారీ పేరుతో వెలసిన పోస్లర్లను తొలగించడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు బండి భగీరథ్ పై ఫోక్సో కేసు నమోదును సవాల్ చేస్తూ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది.

సిట్ విచారణ వేగవంతం

బండి భగీరథ ఫోక్సో కేసు, బాధితురాలిపై అతను పెట్టిన హనీ ట్రాప్ కేసుల విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కేసుల విచారణను వేగవంతం చేసింది. కూకట్ పల్లి డీసీపీ, ఐపీఎస్ రీతిరాజ్ నేతృత్వంలోని సిట్ ఈ రోజు భగీరథను ప్రశ్నించనుంది.