బండి భగీరథ్‌కు కోర్టు షాక్.. మూడు రోజుల పోలీసు కస్టడీ

పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు మల్కాజిగిరి కోర్టు షాక్ ఇచ్చింది. భగీరథ్ ను విచారణ నిమిత్తం మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.

విధాత, హైదరాబాద్ : పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు మల్కాజిగిరి కోర్టు షాక్ ఇచ్చింది. భగీరథ్ ను విచారణ నిమిత్తం మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.

కస్టడీ అనుమతి లభించడంతో పేట్‌బషీరాబాద్‌ పోలీసులు బండి భగీరథ్‌ను అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.

ఈ కేసు విచారణ నిమిత్తం వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా, కోర్టు మాత్రం మూడు రోజులకు మాత్రమే అనుమతించింది. మైనర్ బాలికపై అత్యాచారం అభియోగాలతో ఫోక్సో కేసులో ఈనెల 16న భగీరథ్ ను నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకుని చర్లపల్లికి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

మేజిస్ట్రేట్‌ ఎదుట బాధితురాలి వాంగ్మూలం

ఈ కేసులో ఇప్పటికే మైనర్‌ బాధితురాలిని పోలీసులు మేడ్చల్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. బాధితురాలు, ఆమె తల్లి మేజిస్ట్రేట్‌ ఎదుట తమ వాంగ్మూలం ఇచ్చారు. సుమారు 40 నిమిషాలపాటు వారిద్దరు ఇచ్చిన వాంగ్మూలాలను రికార్డు చేశారు. పోలీసులు బాధితురాలి వాంగ్మూలాలను ఇప్పటికే రెండుసార్లు రికార్డు చేశారు.

Latest News