Bandi Sanjay | బండి సంజయ్‌కు షాక్.. ప్రధాని మోదీ మీటింగ్ నుంచి ఔట్
Bandi Sanjay | ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వేళ బండి సంజయ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మోదీ కార్యక్రమం నుంచి దూరం పెట్టారు.
Bandi Sanjay | ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వేళ బండి సంజయ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మోదీ కార్యక్రమం నుంచి దూరం పెట్టారు. బీజేపీ పెద్దలు, స్థానిక నేతలు పెద్ద ఎత్తున పాల్గొనే ఈ కార్యక్రమంలో బండి సంజయ్ పేరు లేకపోవడం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కార్యక్రమంలో మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి, సురేశ్ గోపీ పేర్లతో పాటు స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లను ప్రచురించారు. కానీ కేంద్రమంత్రి బండి సంజయ్ పేరును ప్రచురించలేదు. ఆఖరి క్షణంలో ఆయన పేరును తీసేసినట్లుగా బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొంటారా? లేదా? అనేది తెలియడం లేదు.

బండి కుమారుడిపై పోక్సో కేసు..!
బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథపై నిన్న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది. తన 17 ఏళ్ల కుమార్తెకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డారని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నిన్న రాత్రి ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేయడంతో తన కూతురు రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించిందని తెలిపింది. మొదట ఫిర్యాదును స్వీకరించేందుకు పోలీసులు వెనుకాడారు.. కానీ బాధితులు కోర్టుకు వెళ్తామని చెప్పడంతో పోలీస్ స్టేషన్‌లో ఆరు గంటల పాటు హైడ్రామా కొనసాగింది. ఆ తర్వాత ఎట్టకేలకు సాయి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు ముందు ఈ ఘటన జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది.

అత్యాచారం కాదు.. హనీట్రాప్!
పోక్సో కేసుపై బండి సంజయ్ కార్యాలయం స్పందించింది. ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన హనీట్రాప్ అని ఒక ప్రకటనలో వెల్లడించింది. కోర్టు సినిమా తరహాలో లేని కేసును సృష్టించి బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారని తెలిపింది. ఓ మహిళ తన కూతుర్ని అడ్డుపెట్టుకుని బండి సంజయ్ కుమారుడిని ట్రాప్ చేసి సుమారు రూ.2 నుంచి 3 కోట్లు డిమాండ్ చేసిందని పేర్కొంది. డబ్బులు ఇవ్వకపోవడంతో బాలికతో పోక్సో కేసును అస్త్రంగా వాడుకుందని తెలిపింది. దీనిపై ఇప్పటికే సదరు మహిళపై బండి సంజయ్ కొడుకు కరీంనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారని వెల్లడించింది. ఆశించినంత డబ్బులు రాకపోవడంతో మహిళా మీడియాను ఆశ్రయించి ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తుందని ఆరోపించింది. కేవలం రాజకీయంగా, ఆర్థికంగా ప్రయోజనం పొందేందుకే సదరు మహిళ ఈ హనీట్రాప్ డ్రామా ఆడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని.. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని బండి సంజయ్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
బండి సంజయ్ ఎమోషనల్!
తన కుమారుడు సాయి భగీరథ్ మీద వస్తున్న ఆరోపణలపై బండి సంజయ్ స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అవన్నీ నిరాధారమైన ఆరోపణలు అని ఆయన పేర్కొన్నారు. ‘ నాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చ లేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను.’ అని బండి సంజయ్ తెలిపారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు తన పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వారిలో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు అద్దం పడుతుందని అన్నారు.
‘అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టాను. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో నాడు కార్పొరేటర్ గా, నేడు ఎంపీగా ఎన్నికై, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెనకబడి వర్గాలకు చెందిన బీసీ వ్యక్తి, నాయకుడిగా కేంద్రమంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరతీశాయి.’ అని అన్నారు. ప్రధాని మోదీ బహిరంగ సభ నేపథ్యంలో తనను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చేయాలన్నదే ఆ కుట్రల వెనకున్న అసలు లక్ష్యమని పేర్కొన్నారు. తప్పేదో.. ఒప్పేదో.. న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందన్న నమ్మకం తనకు ఉందని తెలిపారు. సమయం ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తుంది, ప్రతి కుట్రను బహిర్గతం చేస్తుందని అన్నారు. సత్యమేవ జయతే అని వ్యాఖ్యానించారు.
Read More:
మోదీ పర్యటనపై తెలంగాణ బీజేపీ భారీ ఆశలు
బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు? 5 కోట్ల డిమాండ్ చేశారంటూ సాయి భగీరథ్ ఎదురు కేసు..
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram