గ‌త పాల‌కులే కృత్రిమ క‌రువు సృష్టించారు: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

గ‌త పాల‌కులు ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రాజెక్టుల్లో ఉన్న నీళ్ల‌ను ఓట్లు పొంద‌డానికి వృధాగా వ‌దిలి కృత్రిమ‌ క‌రువును సృష్టించార‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క మండిప‌డ్డారు. కృష్ణా న‌దిలోని శ్రీశైలం, నాగ‌ర్జున సాగ‌ర్‌ ప్రాజెక్టులో

గ‌త పాల‌కులే కృత్రిమ క‌రువు సృష్టించారు: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి bhatti

ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసిన మా ప్ర‌భుత్వానికి ఐదేండ్లు డోకా లేదు

కేంద్రం నుంచి రూ.10ల‌క్ష‌ల‌ కోట్లు వ‌చ్చింది అక్ష‌రాల అబ‌ద్ధం

రాష్ట్రానికి కొత్త విద్యుత్తు పాల‌సీ అవ‌స‌ర‌ముంది

విధాత‌: గ‌త పాల‌కులు ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రాజెక్టుల్లో ఉన్న నీళ్ల‌ను ఓట్లు పొంద‌డానికి వృధాగా వ‌దిలి కృత్రిమ‌ క‌రువును సృష్టించార‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క మండిప‌డ్డారు. కృష్ణా న‌దిలోని శ్రీశైలం, నాగ‌ర్జున సాగ‌ర్‌ ప్రాజెక్టులో ఉన్న నీళ్ల‌ను జాగ్ర‌త్త భ‌ద్ర‌ప‌రుచుకొని వేస‌విలో నీటి ఎద్ద‌డి రాకుండ చూసుకోవాల్సిన బాధ్య‌త‌ను విస్మ‌రించి ఎన్నిక‌ల్లో ఓట్లు పొంద‌డానికి కాలువ‌ల వెంట నీళ్లు పారించి వృధాగా స‌ముద్రంలోకి వ‌దిలార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌త ప‌ది సంవ‌త్స‌రాల్లో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రాష్ట్రానికి రూ.10ల‌క్ష‌ల కోట్లు ఇచ్చామ‌ని ఓ కేంద్ర మంత్రి చెప్ప‌డం అక్ష‌రాల అబ‌ద్దమ‌ని, కేవ‌లం రూ. 3,70, 235 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయ‌ని శుక్ర‌వారం హైద‌రాబాద్, బ‌షీర్‌బాగ్ ప్రెస్ క్ల‌బ్‌లో టీయుడ‌బ్లూజే(ఐజేయూ) ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ప‌లువురు జ‌ర్న‌లిస్టులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చారు. గ‌త బిఆర్ఎస్ ప్ర‌భుత్వం కంటే ముందుగానే కాంగ్రెస్ ప్ర‌భుత్వం నాలుగు నెల‌ల్లో 93శాతం మంది రైతుల‌కు రైతు భ‌రోసా డ‌బ్బులు ఇచ్చామ‌ని వివ‌రించారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా విద్యుత్తు రంగంలో వ‌స్తున్న మార్పుల‌కు అనుగుణంగా గ‌త ప‌ది సంవ‌త్స‌రాలు అధికారంలో ఉన్న బీఆరెస్‌ ప్ర‌భుత్వం ఎటువంటి కృషి చేయ‌లేద‌న్నారు. రూ.20 చోప్పున యూనిట్ కొనుగోలు చేసి రాష్ట్ర ప్ర‌జ‌ల మీద భారం మోపింద‌న్నారు. ప‌వ‌ర్ ఎక్సేంజ్‌లో పీక్ హ‌వ‌ర్స్ కోసం యూనిట్‌కు రూ.10 చొప్పున మాత్ర‌మే త‌మ ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌కంగా కొనుగోలు చేస్తున్న‌ద‌ని వివ‌రించారు. త‌మ ప్ర‌భుత్వం రానున్న రోజుల్లో ప‌ర్యావ‌ర‌ణ‌ హితమైన‌, చ‌వ‌కైన‌ రినోవేబుల్ ఎన‌ర్జీని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అందించ‌డానికి కొత్త విద్యుత్తు పాల‌సీ తీసుకురావ‌డానికి ఇప్ప‌టికే ప్ర‌ణాళిక‌లు రూపొందించే ప‌నిలో అధికారులు నిమ‌గ్న‌మై ఉన్నార‌ని తెలిపారు.

ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసిన మా ప్ర‌భుత్వానికి ఐదేండ్లు డోకా లేదు, కోరి కోట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను తీర్చ‌డానికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఈ ఐదు ఏండ్లు ప్ర‌జ‌ల ల‌క్ష్యాలు నెర‌వేర్చే విధంగా పాల‌న అందిస్తామ‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం విద్య‌, వైద్యానికి అత్యంత ప్రాధ‌న్య‌త ఇస్తుంద‌న్నారు. అధికారంలోకి రాగానే మొద‌టి బ‌డ్జెట్‌లో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియ‌ల్ భ‌వ‌నాల నిర్మానాల‌కు రూ.4వేల కోట్లు కేటాయించామ‌న్నారు. త్వ‌ర‌లోనే తెలంగాణ ప‌బ్లిక్ స్కూల్స్ తీసుకురావ‌డానికి ఆలోచ‌న చేస్తున్న‌ట్టు చెప్పారు. ఆదిలాబాద్ నుంచి ఖ‌మ్మం వ‌ర‌కు చేసిన పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను క‌చ్చితంగా అమ‌లు చేస్తామ‌ని భ‌ట్టి వెల్ల‌డించారు.