Maheshwar Reddy | భారీ కుంభకోణాల్లో మంత్రి పొంగులేటి కంపెనీ: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కంపెనీ భారీ కుంభకోణాలకు పాల్పడిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

Maheshwar Reddy | భారీ కుంభకోణాల్లో మంత్రి పొంగులేటి కంపెనీ: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

విధాత, హైదరాబాద్ : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కంపెనీ భారీ కుంభకోణాలకు పాల్పడిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. యూరో ఎగ్జిన్ బ్యాంక్ కుంభకోణంలో రాఘవ కంపెనీ భాగస్వామి అని అన్నారు. పొంగులేటికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించారు. ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించి మోసానికి పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిన్ బ్యాంకు లేదని, ఆ బ్యాంకు గ్యారంటీలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుంభకోణంలోని గుత్తేదారుల పేర్లు త్వరలోనే బయట పెడతానన్నారు.

చట్టాలను దుర్వినియోగం చేసి లబ్ది పొందిన గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని భారీ గుత్తేదారులు ఈ కుంభకోణంలో భాగస్వాములయ్యారన్నారు. బ్యాంకు గ్యారంటీలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలన్నారు. ఫెక్ డాకుమెంట్లతో వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకుంటున్నారని ,ప్రభుత్వాన్ని,చట్టాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సర్పంచులకు బిల్లులు రావు కానీ మంత్రి పొంగులేటి వందల కోట్ల చెల్లింపు జరిగిపోతుందని, పొంగులేటి కంపెనీల కుంభకోణాలను మునుముందు మరిన్ని బయటపెడుతామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను లేవనెత్తుతామని, రూ. 6వేల కోట్ల ఎవరెవరికి ఇచ్చారో ప్రజలముందు పెట్టాలని ఏలేటి డిమాండ్ చేశారు