దానంపై అనర్హత వేటుకు స్పీకర్‌కు .. బీజేపీ ఫిర్యాదు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై బీఆరెస్‌, బీజేపీ పార్టీలు చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే బీఆరెస్ అటు స్పీకర్‌కు ఫిర్యాదుచేయడంతో పాటు హైకోర్టును సైతం ఆశ్రయించింది.

దానంపై అనర్హత వేటుకు స్పీకర్‌కు .. బీజేపీ ఫిర్యాదు

విధాత, హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై బీఆరెస్‌, బీజేపీ పార్టీలు చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే బీఆరెస్ అటు స్పీకర్‌కు ఫిర్యాదుచేయడంతో పాటు హైకోర్టును సైతం ఆశ్రయించింది. ఇప్పుడు బీజేపీ సైతం దానం వ్యవహారంలో జోక్యం చేసుకుంది. దానంపై అనర్హత వేటు వేయాలని స్పీడ్ పోస్టు ద్వారా అసెంబ్లీ స్పీకర్‌కు బీజేపీ ఎల్పీ పిటిషన్ పంపింది. అయితే, స్పీడ్ పోస్టులో వచ్చిన ఈ పిటిషన్‌ను స్పీకర్ కార్యాలయం స్వీకరించలేదని సమాచారం. దీంతో బీజేపీ కూడా దానంపై అనర్హత వేటు విషయమై హైకోర్టును ఆశ్రయించనున్నట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన దానం.. అనంతరం లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.