Har Ghar Tiranga | హర్ ఘర్ తిరంగా కార్యక్రమంతో సమైక్యత.. బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి

దేశ 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రజలలో దేశభక్తిని పెంపొందించడానికి బిజెపి "హర్ ఘర్ తిరంగ" ప్రచారాన్ని ప్రారంభించిందని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి అన్నారు.

Har Ghar Tiranga | హర్ ఘర్ తిరంగా కార్యక్రమంతో సమైక్యత.. బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి

విధాత, వరంగల్ ప్రతినిధి: దేశ 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రజలలో దేశభక్తిని పెంపొందించడానికి బిజెపి “హర్ ఘర్ తిరంగ” ప్రచారాన్ని ప్రారంభించిందని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ బిజెపి యువ మోర్చ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ భీమారం నుండి కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ వరకు తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమనికి రావు పద్మ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరు వారి వారి ఇంటిపై జాతీయ జెండాను ఎగర వెయ్యాలని, వ్యక్తిగత అభిప్రాయాలు, కుల, మత, ప్రాంత అభిప్రాయ బేధాలకన్నా జాతీయభావనే అత్యుత్తమమన్నారు. ప్రతి ఒక్కరూ నా దేశం అని భావించినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బిజెపి జిల్లా యువ మోర్చ అధ్యక్షులు తీగల భరత్ గౌడ్, యువ మార్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు తరుణ్ రెడ్డి, దయాకర్, బిజెపి మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు రత్నా లక్ష్మి, జిల్లా నాయకులు గొర్రె ఓం ప్రకాష్, మహేందర్ పటేల్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎరుకల దివాకర్, నిఖిల్ చోప్రా, యువ మోర్చ నాయకులు హరీష్, మూల రాము, మురళీ, వెంకట్రమణ, రాజు, శివ, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.