MP Arvind | సీఎం రేవంత్ ప్రభుత్వం కూలిపోతుంది: ఎంపీ అర్వింద్

ప్రజలు గట్టిగా కోరుకుంటే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నెలరోజుల్లో కూలిపోతుందని నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు

MP Arvind | సీఎం రేవంత్ ప్రభుత్వం కూలిపోతుంది: ఎంపీ అర్వింద్

విధాత, హైదరాబాద్: ప్రజలు గట్టిగా కోరుకుంటే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నెలరోజుల్లో కూలిపోతుందని నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుకుంటే ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ పతనావస్థకు చేరిందన్నారు. దేశంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ ప్రభుత్వాలు పడిపోతాయని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసగించిందని విమర్శించారు. ఐదేళ్లలో ఎంపీగా నాపై ఒక్క అవినీతి ఆరోపణ లేదన్నారు. నాకంటే ముందు ఎంపీగా ఉన్న కవిత జైలులో ఉన్నారని గుర్తు చేశారు. అవినీతి చేసే రోజు వస్తే తాను రాజకీయాలే వదిలేస్తా తప్ప తప్పు చేయనని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకొచ్చానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్ట్‌ ఏడాదిలోపే తెరచుకోవచ్చని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకున్నందుకు మన పనులు కావట్లేదని అర్వింద్ ఆరోపించారు.

Mp Arvind | తొమ్మిది మెడికల్ కాలేజీల్లో KCR పైసా ఒక్కటి లేదు: ఎంపీ అర్వింద్‌

Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డిపై ఈసీకి వీహెచ్‌పీ ఫిర్యాదు