BJP | మెదక్‌లో పట్టుదప్పిన కారు.. కమల వికాసం
మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ గణనీయంగా పురోగమించి విజయం సాధించింది

మూడు నియోజకవర్గాల్లో బీఅరెఎస్ ఆధిక్యం
మూడవస్థానానికి పడిపోయిన బీఅరెఎస్
పఠాన్‌చేరులో 3 వ స్థానంలో బీఅరెఎస్
సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకల్లో తగ్గిన బీఅరెఎస్ మెజారిటీ
నర్సాపూర్, సంగారెడ్డిలో కాంగ్రెస్‌కు మెజారిటీ
విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ గణనీయంగా పురోగమించి విజయం సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుకు దూసుకుపోయి గెలుపొందింది. ఏకంగా పఠాన్ చెరువు, మెదక్‌లో లక్షా 3 వేల 775 ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. 2వ స్థానంలో 94,292 ఓట్లు సాధించి కాంగ్రెస్ పార్టీ, 3వ స్థానంలో బీఆరెస్ నిలిచింది.
మెదక్‌లోనూ బీజేపీకి మెజారిటీ
మెదక్ నియోజక వర్గంలో సహితం బీజేపీ 67 3374 ఓట్లు సాధించి ముందు వరసలో నిలిచింది. ఇక్కడ అధికార కాంగ్రెస్ కంటే 11 వేల పైచిలుకు ఓట్లు సాధించి కాంగ్రెస్, బీఅరెఎస్ పార్టీ లను మట్టి కరిపించింది. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ కి 55588 ఓట్లు రాగా ,బీజేపీ 67 వేల374 ఓట్లు సాధించింది. బీఅరెఎస్ పార్టీ కేవలం 40 వేల776 ఓట్లు పొంది 3 వ స్థానానికి పరిమితమైంది. సంగారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే దాదాపు 6 వేల మెజార్టీ సాధించింది. ఇక్కడ బీఅరెఎస్ 3 వ స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ కు 75 287,బీజేపీ కి70,310,బీఅరెఎస్ కు 27874 ఓట్లు పోలయ్యాయి.
అక్కడ బీఆరెస్ కు తగ్గిన ఓట్లు
దుబ్బాక, సిద్దిపేట,గజ్వేల్‌లో బీఅరెఎస్ పార్టీ మెజార్టీ సాధించినా గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే గణనీయంగా తగ్గింది. దుబ్బాక నియోజక వర్గంలో బీఅరెఎస్ పార్టీ 66 వేల 714 పొందగా,బీజేపీ 50 వేల873 ఓట్లు సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 31641 ఓట్లు పొంది 3 వస్థానం లో నిలిచింది.ఇక్కడ బీఅరెఎస్ పార్టీ ఆధిక్యత సాగించినా గత అసెంబ్లీ ఎన్నికలతో పొల్చితే మెజార్టీ తగ్గింది.
ఇక సిద్దిపేటలో బీ అరెఎస్ పార్టీకి గతంతో పోలిస్తే దాదాపు 75 వేల ఓట్లు తగ్గాయి. ఇక్కడ బీ అరెఎస్ కు 65 వేల501 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 62 వేల 823 ఓట్లు సాధించి బీఅరెఎస్ పార్టీకి గట్టి పోటీ నిచ్చింది. ఇక్కడ కేవలం బీ అరెఎస్ 2678 ఓట్లు ఆధిక్యత సాధించింది. గతంలో హరీష్ రావు కు 80 వేల మెజార్టీ వచ్చింది.ఇక్కడ గణనీయంగా బీ అరెఎస్ కు ఓట్లు తగ్గడంతో బీఅరెఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్ రామ్ రెడ్డి 3 వ స్థానానికి పరిమితమయ్యారు. దుబ్బాక, గజ్వేల్, మెదక్, నర్సాపూర్ ,సంగారెడ్డిలో గత మెజారిటీ సాధిస్తే బీఅరెఎస్ అభ్యర్థిని విజయం వరించేది.
నర్సాపూర్ నియోజక వర్గంలో బీ అరెఎస్ ఎంఎల్ఏ సునితా లక్ష్మారెడ్డి ప్రాతినిద్యం వహించినా ఇక్కడ అనుహ్యంగా కాంగ్రెస్ 22 వేల ఓట్ల మెజారిటీ సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ72 వేల 376 ఓట్లు సాధించి ముందువరుసలో నిలిచింది. మాజీ ఎంఎల్ఏ మదన్ రెడ్డి, ఆవుల రాజిరెడ్డి,డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,సుహాసిని రెడ్డి లు సమన్వయంతో పని చేయడంతో కాంగ్రెస్ కు మెజార్టీ తెచ్చి పెట్టింది. బీ అరెఎస్ 54 వేల 372 ఓట్లు పొంది 2 వ స్థానంలో నిలిచింది.బీజేపీకి సైతం ఇక్కడ 51 వేల811 ఓట్లు సాధించి బీ అరెఎస్ కు గట్టి పోటీ నిచ్చింది.