Padi Koushik Reddy | బ్లాక్ బుక్‌లో తొలి పేరు మంత్రి పొన్నందే: బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

బీఆరెస్ పార్టీ బ్లాక్ బుక్ ఓపెన్ చేశామని, తొలి పేరుగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేరును రాశామని బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రకటించారు.

Padi Koushik Reddy | బ్లాక్ బుక్‌లో తొలి పేరు మంత్రి పొన్నందే: బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద హల్‌చల్‌

విధాత, హైదరాబాద్‌ : బీఆరెస్ పార్టీ బ్లాక్ బుక్ ఓపెన్ చేశామని, తొలి పేరుగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేరును రాశామని బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రకటించారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఫ్లై యాష్‌లో 100కోట్ల స్కామ్‌, ఆర్టీసీ టికెటింగ్ మిషన్ స్కామ్‌లో మంత్రి పొన్నం తిన్న డబ్బులను కక్కిస్తామని కౌశిక్‌రెడ్డి చెప్పారు. బుధవారం ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర స్వామి దేవాలయం సాక్షిగా, మీడియా సాక్షిగా బ్లాక్ బుక్ మొదటి పేజీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు రాసినట్లుగా , అవినీతి చేసిన మంత్రులను, ఎమ్మెల్యేల పేర్లను బ్లాక్ బుక్ లో రాస్తున్నట్లుగా తెలిపారు. ఫ్లై యాష్ స్కామ్‌లో మంత్రి పొన్నం అవినీతి చేయకపోతే జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరిన కౌశిక్‌రెడ్డి ఉదయం 11గంటలకు ఆలయానికి చేరుకున్నారు. తనపై పొన్నం ప్రభాకర్‌ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.

తప్పు చేయకపోతే ప్రమాణం చేసేందుకు పొన్నం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రమాణానికి రానందునా 100 కోట్ల కుంభకోణం చేశాడని నిరూపితమైందన్నారు. అంతకుముందు రోజు మంగళవారం పొన్నం తరుపునా హుజూరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి ఒడిదెల ప్రణవ్ చేసిన సవాల్ మేరకు చెల్పూరు ఆంజనేయస్వామి ఆలయం వద్ధ ప్రమాణ స్వీకారం చేసేందుకు కౌశిక్‌రెడ్డి బయలుదేరగా, ఆయనను వీణవంకలోని నివాసంలో పోలీసులు గృహనిర్భంధం చేశారు. దీంతో ఇంటి వద్దనే స్నానం చేసి తడివస్త్రాలతో దేవుడి చిత్రపటాలపై తాను ఎవరి వద్ద వసూళ్లకు పాల్పడలేదని, కాంగ్రెస్‌ నాయకులు చేసిన ఆరోపణలకు తన నియోజకవర్గ ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రమాణం చేస్తున్నానని చెప్పారు.. ప్లెయాష్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ రూ. 100 కోట్ల అవినీతికి పాల్పడినట్టు తాను బహిరంగంగానే ఆరోపించినా ఎందుకు ప్రమాణం చేసేందుకు రాలేదని ప్రశ్నించారు. మంత్రికి మరో అవకాశం ఇస్తున్నానని, తనతో కలిసి హైదరాబాద్ జూబ్లీహీల్స్‌ వెంకటేశ్వరస్వామి గుడికి రావాలని, రూ.100 కోట్ల అవినీతి చేయలేదని నిరూపిస్తే, తాను బహిరంగ క్షమాపణ చెబుతానని స్పష్టంచేశారు. ఈ మేరకు కౌశిక్‌రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్ ఆలయానికి చేరుకుని హల్‌చల్ చేశారు.