BRS | తప్పుడు కేసులకు భయపడేది లేదు : శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ
బీఆరెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన తాము భయపడేది లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం ఆయన హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
విధాత, వరంగల్ ప్రతినిధి:
BRS | బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా ఉండటం కరెక్టు కాదని శాసనమండలి ప్రతిపక్షనేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. పోలీసులు ఎప్పుడైనా సరే నిస్పక్షపాతంగా విధులు నిర్వహించాలన్నారు. రెండు మూడు రోజుల నుంచి తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టిన విషయాన్ని వరంగల్ పోలీసు కమిషనర్‌కు తెలియజేశామన్నారు. ప్రజాస్వామ్యంలో దిగజారిన రాజకీయాలు చేయకూడదన్నారు. ఎవరి మెప్పు కోసం పోలీసులు బీఆర్ ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రశ్నించారు. హనుమకొండలో గురువారం ఆయన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తాము ఇలాంటి పోలీసు కేసులకు అదరిదీలేదు, బెదిరేదీలేదన్నారు. వరంగల్ లో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు ఇన్నేండ్లలో ఏనాడూ చూడలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వరదబాధితులను పరామర్శించడానికంటే రాజకీయ పబ్బం కోసం వచ్చినట్టు ఉందని విమర్శించారు. 50 లక్షల జనాభా ఉన్న నగర ప్రజల కోసం కనీసం మూడు గంటల సమయం కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు.
వరంగల్ అభివృద్ధికి బీఆర్ఎస్ కృషి: దాస్యం
ఏడు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్, బీజేపీలే ఎక్కువ కాలం ఈ రాష్ట్రాన్ని, జిల్లాను పాలించినప్పటికీ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వరంగల్ నగరాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టామని మాచీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వేలాది కోట్ల రూపాయలు నిధులు ఓరుగల్లుకు మంజూరు చేశామని చెప్పారు. రోడ్లు, నాలా మరమ్మత్తు, అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టి, అభివృద్ధి చేశామని చెప్పారు. నాలా అక్రమ నిర్మాణం ఎవరు చేశారో బయట పెడుతామన్నారు. మా హయాంలో నిర్మించిన అండర్ వాటర్ డక్ట్ క్రష్ గేట్లు ఎత్తకపోవడం వల్లే నగరం మునిగిందన్నారు. అధికారం ను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడుతున్నారని, మా విద్యార్థి నాయకులపై కేసులు పెట్టి, కొడుతున్నారని, ఇన్నాళ్లు సహించాం, ఇకపై పోరాడుతామని హెచ్చరించారు.
Read Also |
Mother Dairy farmers protest| పాల బిల్లులు ఇవ్వండయ్యా..రోడ్డెక్కిన పాడి రైతులు
Kalvakuntla Kavitha | వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోండి : ఆర్టీసీ ఎండీకి కవిత వినతి
Nagarjuna Defamation Case : కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం కేసు విచారణ వాయిదా.!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram