బీఆర్ఎస్ హయాంలోనే గోదావరి, కృష్ణా జలాల నీటి వాటాల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు విచక్షణ కోల్పోయి సెన్స్ లెస్ గా జీఆర్ఎంబీ అజెండాపై తమ ప్రభుత్వాన్ని విమర్శించారని ఉత్తమ్ మండిపడారు. నీటి వాటాలు, ప్రాజెక్టుల రద్దు వంటి అంశాలపై టీఆర్ఎంబీకి అధికారాలు లేవన్న విషయం తెలిసి కూడా హరీశ్ రావు మాపై రాజకీయ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పంపులు ఆన్ చేయడం లేదని, జీఆర్ఎంబీలో ఏదో జరిగిపోతుందంటూ పలు రకాల అసత్యాలతో విమర్శలు చేస్తూ…ఇరిగేషన్ పై ఆయనకొక్కడికే నాలెడ్జ్ ఉన్నట్లుగా హరీశ్ రావు మాట్లాడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు.
పంపులు ఎప్పడు ఆన్ చేయాలో, నీటి వాటాల పరిరక్షణలో ఏం చేయాలో మాకు తెలుసు అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, నేను గాని కృష్ణా, గోదావరి నది జలాల పట్ల పూర్తి చిత్తశుద్ధితో సమర్థతతో మన వాటా కోసం అన్ని వేదికలపైన మాట్లాడుతున్నాం అని, ఎక్కువ వాటా ఉపయోగిస్తున్నాం అని, మా హయాంలోనే తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రైస్ ప్రొడక్ట్ సెంటర్ నిలిచిందని ఉత్తమ్ స్పష్టం చేశారు.
నిజాయితీపరుడివైతే రెండోసారి ఇరిగేషన్ శాఖ ఎందుకివ్వలే..
హరీశ్ రావు నిజాయితీ పరుడైతే కేసీఆర్ ఆయనకు రెండోసారి ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ ఎందుకివ్వలేదో ఆయన చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బీఆర్ఎస్ రూ.1400కోట్లను ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో తీసుకుందని కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై ముందుగా హరీశ్ రావు సమాధానం చెప్పాలని ఉత్తమ్ నిలదీశారు. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయినందుకు, కృష్ణా , గోదావరి ప్రాజెక్టులను పూర్తి చేయనందుకు, నీటి వాటాలలో నష్టం చేసినందుకు ముందుగా బీఆర్ఎస్ పాలకులు రాష్ట్ర ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
అంచనాలు పెంచి దోచుకున్నారు..
బీఆర్ఎస్ హాయంలో అప్పటి ఏసీ సీఎం జగన్ తో కేసీఆర్ అలయ్ బలయ్ చేసుకుని, కృష్ణా జలాల్లో 299టీఎంసీలుచాలు..512 టీఎంసీలు మీరు తీసుకోండని చెప్పారని ఉత్తమ్ గుర్తు చేశారు. వారి హయాంలోనే పోతిరెడ్డి పాడు పెంచారని, రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ వచ్చిందని, బనకచర్లపై మాట్లాడుకున్నారని, మేం వాటిని ఆపామని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చి తెలంగాణ గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోకుండా అన్యాయం చేశారని, 38వేల కోట్లతో కట్టాల్సిన ప్రాణిహిత ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చి 1లక్ష 47కోట్లకు పెంచి కమిషన్లు దండుకున్నారని విమర్శించారు. చివరకు కూలిపోయే ప్రాజెక్టు కట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లవ్వకుండా చేశారని, బీఆర్ఎస్ హాయంలో 1కోటి 81 లక్షల కోట్లు ఖర్చుపెట్టి ఒక్క ఎకరాకు కొత్తగా నిళ్లీవ్వలేదని, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, ఎస్ఎల్బీ సీ టన్నెల్ లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టుల డిజైన్లు మార్చి వేలకోట్లు దోచుకున్నారని ఉత్తమ్ విమర్శించారు.
జూలై నాటికి వినియోగంలోకి కాళేశ్వరం బ్యారేజీలు
మా ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులతో పాటు తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కట్టడానికి కట్టుబడి ఉందని, మేము దానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడు బ్యారేజీలు చర్యలు టెస్టింగ్, మరమ్మతులు సాగుతున్నాయని, ఎన్డీఎస్సీ రిపోర్టు, సీడబ్ల్యూసీ పరిశీలన పిదప రీహాబిటేషన్, రిపేర్ల డిజైన్ వర్క్ లను వచ్చే నవంబర్ వరకు ఫైనల్ చేసి..రానున్న జూలై వరకు మూడు బ్యారేజీలను తిరిగి ఉపయోగంలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాం అని ఉత్తమ్ తెలిపారు.
