KTR | మేం నాలుగేళ్ల తర్వాతా అధికారంలోకి వస్తాం.. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం: కేటీఆర్
తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిపాదన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని అవమానిస్తుందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు
KTR | తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిపాదన స్థలంలో రాజీవ్‌గాంధీ (Rajiv Gandhi) విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తెలంగాణ తల్లిని అవమానిస్తుందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సోమవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ నాలుగేళ్ల తరువాత మేం అధికారంలోకి రాగానే సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని చెప్పారు. సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని గతంలోనే దశాబ్ధి ఉత్సవాల్లో నిర్ణయం తీసుకున్నాన్నారు. అందుకు విరుద్ధంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న స్థానంలో పెట్టిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతున్నారని, మేము అధికారంలోకి రాగానే రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తీసేస్తామని, కాంగ్రెస్ వాళ్లు ఎక్కడ కోరుకుంటే అక్కడికి తరలిస్తామన్నారు. తెలంగాణ బిడ్డ మాజీ సీఎం అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం తప్పకుండా తొలగిస్తామన్నారు. తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం ఏమిటో ఎవరికి అర్ధం కావట్లేదన్నారు.
Live: BRS Party Working President @KTRBRS addressing the media at Nandinagar, Hyderabad. https://t.co/mpR6ZPy0Ps
— BRS Party (@BRSparty) August 19, 2024
సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) జై తెలంగాణ అనడని, 125ఫీట్ల ఎత్తులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జయంతి, వర్ధంతుల వేళ లైటింగ్ ఏర్పాటు చేయడం లేదని, అమర జ్యోతి పనులు పూర్తి చేయించలేదన్నారు. మేం పదేళ్లు సంస్కరవంతంగా పాలించామని, రాజీవ్ ఆరోగ్య శ్రీ పేరు మార్చలేదని, రాజీవ్ రహాదారి హైవే పేరు మార్చాలేదని, త్రిఫుల్ ఐటీ బాసరకు రాజీవ్ పేరు మార్చలేదని, ఉప్పల్ స్టేడియం, రాజీవ్ అంతర్జాతీయ విమనాశ్రయాల పేర్లు మార్చలేదన్నారు. మీరు తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకకైన తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాతా ఇక మేం బాధతో చెబుతున్నామని, మళ్లీ మేం అధికారంలోకి రాగానే వాటన్నింటి పేరు మార్చుతామన్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు పేరు మార్చలేని, ఈదఫా అధికారంలోకి రాగానే రాజీవ్‌గాంధీ ఎయిర్ పోర్టుకు తెలంగాణ బిడ్డ పేరు పెడతామని తెలిపారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వద్ధ మార్కులు కొట్టేయడానికి రాజీవ్ గాంధీ విగ్రహం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోగాని, జూబ్లీహిల్స్‌లోనీ సీఎం ఇంట్లోగాని పెట్టుకోవాలని కేటీఆర్ విమర్శించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram