ముస్తాబాద్: సంజయ్ చిత్రపటానికి క్షీరాభిషేకం.. మంత్రి KTR దిష్టిబొమ్మ దహనం
విధాత, కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల(Rajanna sirisilla) జిల్లా ముస్తాబాద్(Mustabad) మండల కేంద్రంలో బిజెపి(BJP) నేతలు మంత్రి కెటిఆర్(KTR) దిష్టిబొమ్మను దహనం చేశారు. బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొదట సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కడే మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఓ మహిళా సర్పంచ్ మొరపెట్టుకున్నపుడు, ఎమ్మెల్సీ […]
విధాత, కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల(Rajanna sirisilla) జిల్లా ముస్తాబాద్(Mustabad) మండల కేంద్రంలో బిజెపి(BJP) నేతలు మంత్రి కెటిఆర్(KTR) దిష్టిబొమ్మను దహనం చేశారు. బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొదట సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అక్కడే మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే వేధిస్తున్నాడని ఓ మహిళా సర్పంచ్ మొరపెట్టుకున్నపుడు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినపుడు, మెడికో ప్రీతి వేధింపుల సంఘటనలో స్పందించని మహిళా కమిషన్ బండి సంజయ్ విషయంలో స్పందించడంలో అర్థమేంటని ప్రశ్నించారు.

తెలంగాణ లో కవిత ఒక్కదాని కోసమే మహిళా కమిషన్ పని చేస్తున్నట్టు ఉందని ఆరోపించారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కస్తూరి కార్తిక రెడ్డి, ప్రధాన కార్యదర్శి క్రాంతి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారం సంతోష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మహేందర్, బాద నరేష్, తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram