బర్రెలక్క కు మద్దతుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ప్రచారం
విధాత : కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి కర్నే శిరీషా అలియాస్ బర్రెలక్కకు మద్దతుగా సీబీఐ మాాజీ జేడీ లక్ష్మినారాయణ శనివారం కొల్లాపూర్‌లో ప్రచారం నిర్వహించారు. బర్రెలక్క ఎమ్మెల్యే అయితే మొదట ఆనందపడేది తానేనన్నారు. యువత తమ సమస్యలపై గళమెత్తడంతో పాటు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా బర్రెలక్క ఎన్నికల్లో పోటీకి దిగడాన్ని తాను అభినందిస్తున్నానన్నారు. డబ్బు, స్వార్ధంతో కూడిన నేటీ రాజకీయాల్లో బర్రెలక్కను ప్రజలు గెలిపించి రాజకీయాల్లో మార్పులకు నాంది పలకాలన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram