Minister Ramdas Athavale | ఎన్డీయే ప్రభుత్వానికి దేశమంతా సమానమే..

ఆంధ్ర ప్రదేశ్ కు రాజదాని లేకపోవడంతో ఎక్కువ నిధులు....తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, మెదక్ లో మీడియా సమావేశం లో... కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అతువాలే 

Minister Ramdas Athavale  | ఎన్డీయే ప్రభుత్వానికి దేశమంతా సమానమే..

విధాత:మెదక్ ప్రత్యేక ప్రతినిధి;  ఎన్డీయే ప్రభుత్వనికి దేశమంతా సమానమే నని ,ఆంధ్రప్రదేశ్ కు రాజదాని లేకపోవడంతో ఎక్కువ నిధులు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేసిందని,ఐనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి రాందాస్ అతువాలే అన్నారు.మెదక్ లో ఎంపీ రఘునందన్ రావు తో కలసి కేంద్ర మంత్రి మీడియా సమావేశం లో మాట్లాడారు.

* సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు చేసిందని అన్నారు.
* కేంద్ర బడ్జెట్ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం
* రైతులు, నిరుద్యోగులు, మహిళలు, కార్మికులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ముద్ర యోజన కింద చిరు వ్యాపారులకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా బ్యాంక్ ల ద్వారా అందించే రుణ సహాయం 20 లక్షలకు పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు.
* జన్ దన్ యోజన కింద 21 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్ లు తెరిపించడం లక్ష్యం మొది పనిచేస్తున్నారని అన్నారు.
* ఉజ్వల యోజన పథకం కింద పెద మహిళలకు గ్యాస్ కనెక్షన్ లు ఇస్తున్నామన్నారు.
* మోడీ మూడవ సారి ప్రధాన మంత్రి అయిన సందర్భంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో 3 కోట్ల మంది పేదలకు పక్కా ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టలని నిర్ణయం. బడ్జెట్ లో నిధుల కేటాయింపు లు చేశారన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రైవేట్ హాస్పటల్ లలో ఒక కుటుంబానికి ఒక ఏడాదికి 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని అన్నారు.
* కౌశల్ యోజన పథకం కింద యువకులకు ఇంటర్న్ షిప్
* 25 వేల గ్రామాలకు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద రోడ్డు సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ బడ్జెట్ లో ప్రధాని మోడీ నేతృత్వం లోని ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి నైపుణ్యాలు మరియు మధ్యతరగతి పై దృష్టి సారించిందనీ అన్నారు. రూ 2 లక్షల కోట్ల కేంద్ర వ్యయంతో 5 సంవత్సరాల వ్యవధిలో నాలుగు పాయింట్ ఒకటి 4,1 కోట్ల మంది యువతకు ఉపాధి నైతిన్ యాదవ్ మరి ఇతర అవకాశాల కోసం ప్రధాన మంత్రి అయిదు పథకాలు మరియు కార్యక్రమాల ప్యాకేజీ ఈ ఏడాది విద్యా ఉపాధి నైపుణ్యాల కోసం, 1,48 లక్షల కోట్ల కేటాయించారు. ఈ సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు,జిల్లా పార్టీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్,ఏం ఎల్ ఎన్ రెడ్డి,నాయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు