రూ. 225 కోట్లతో బాసర ఆలయ పునర్నిర్మాణ మాస్టర్ ప్లాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్

రూ.225 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శాస్త్రోక్తంగా పనులు చేపట్టి భక్తులకు ఆధునిక వసతులు కల్పించనున్నారు.

Basara Master Plan

విధాత, హైదరాబాద్ : రూ. 225 కోట్లతో చేపట్టనున్న బాసర ఆలయ పునర్నిర్మాణం పనులకు సంబంధించి రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఈ నెల 6న అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి కోసం రూపొందించిన రూ. 225 కోట్ల మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాస్టర్ ప్లాన్ కు ఆమోదం తెలిపారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్రోక్త విధానాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి జరగాలని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తులో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రహదారులను విశాలంగా నిర్మించాలని సూచించారు.

తిరుమల తరహాలో ఆలయ పరిసరాల్లో రాజకీయ కార్యకలాపాలను నిషేధించాలని, కేవలం ఈవీ వాహనాలనే అనుమతించాలని అధికారులను ఆదేశించారు. భక్తుల విశ్వాసాలకు భంగం కలగకుండా, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా సువిశాలమైన రోడ్లు, అత్యాధునిక వసతులతో క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎస్ రామకృష్ణారావు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ సహా జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

ఏపీ రాజధాని అమరావతి పేరుతో కొత్త మ్యాప్ !
ఆర్ఎస్ కే దక్కిన ఇబ్రహీంపట్నం, క్యాతనపల్లి మున్సిపాలిటీలు!

Latest News