విచక్షణ జ్ఞానంతో ఓటు వేయాలి: సీఎం కేసీఆర్

ముథోల్ నియోజకవర్గంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఉంది. విఠల్ రెడ్డి తండ్రి గడ్డెన్న చాలా సేవ చేశారు. ఎమ్మెల్యేగా పని చేశారు. గడ్డెన్న వాగు కింద 14 వేల ఎకరాలు పారాలి. కానీ 4 వేల ఎకరాలకు కూడా నీళ్లు వచ్చేవి కావు. డబ్బులు మంజూరు చేయించి పనులు చేయించాం. ఇప్పుడు 12 వేల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. మిగతా పనులు పూర్తయితే మిగిలిన రెండు, మూడు వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి.
అదే విధంగా ఎస్సారెస్పీ నుంచి లిఫ్ట్ పెట్టుకున్నాం.. కాంట్రాక్టర్ వల్ల ఆ పనులు ఆలస్యమయ్యాయి. మొన్ననే ఆ పనులు పునఃప్రారంభమయ్యాయి. ముథోల్, తానూరు, లోకేశ్వరం మడలాల్లో 50 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి. చెరువులన్నీ బాగు చేసుకున్నాం. వాగుల మీద చెక్ డ్యాంలు కట్టుకున్నాం. ఈ పని కాంగ్రెస్ ఎందుకు చేయలేదు. వారి హయాంలో చెరువులు బాగు చేయలేదు. ఇవాళ రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువు బస్తాలు దొరికేది కాదు.
చెప్పులు లైన్లో పెట్టి ఎరువులు, విత్తనాలు తీసుకునేది. ఇవాళ ఎరువులు, విత్తనాలు దొరుకుతున్నాయి. ఈ ప్రాంతంలో పత్తి తప్ప వేరే పండించేది కాదు. వరి, సోయా, ఇతర పంటలు పండిస్తున్నారు. రైతులు లాభాలు గడిస్తున్నారు. రైతుబంధుతో అప్పులు తీరుతున్నాయి. చాలా కష్టపదడి సమస్యలు తీర్చుకున్నాం. మంచినీళ్ల బాధలు లేవు. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి భగీరథ నీళ్లు అందిస్తున్నాం. కరెంట్ బాధ లేదు. యాదాద్రి పవర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే కరెంట్ కొరత రానే రాదు.
ముథోల్‌లో ఇవాళ బీజేపీ పార్టీ అభ్యర్థిని మీరు క్వశ్చన్ అడగాలి. మోదీకి ప్రయివేటైజేషన్ పిచ్చి పట్టుకుంది. విమానాలు, ఓడరేవులు, రైల్వేలు, లోకమంతా ప్రయివేటు. చివరకు కరెంట్ కూడా ప్రయివేటు. బోర్ మోటార్ల కాడా మీటర్లు పెట్టాలని ఆర్డర్ చేశారు. నేను చెప్పిన పాణం పోయినా తల తెగిపడ్డా పెట్టను అని చెప్పను. ఏడాదికి వచ్చే రూ. 5 వేల కోట్లు కట్ చేస్తానని చెప్పాడు. అలా ఐదేండ్లకు కలిసి రూ. 25 వేల కోట్లు నష్టం చేసిండు.
మనకు రావాల్సింది రాకుండా.. మీటర్లు పెట్టలేదు అని బంద్ పెట్టిండు. రైతాంగం నిలబడాలి. రైతులు ఆగమైపోయారు. రైతులు కచ్చితంగా బాగుపడాలి. వ్యవసాయం బాగుండాలనే సిద్ధాంతో ఎంత ఒత్తిడి చేసినా మీటర్లు పెట్టలేదు. భవిష్యత్‌లో కూడా మీటర్లు పెట్టం. మీటర్లు పెట్టేటోళ్లకు ఓట్లు వేయమని చెప్పాలి. రూ. 25 వేల కోట్లు కట్ చేసిన పార్టీ ఇవాళ ఏముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావని ప్రశ్నించాలి.
దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. కానీ తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు. 50 ఉత్తరాలు రాశాను. ఎందుకు ఇవ్వలే. ఇదేం వివక్ష. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి. నవోదయ విద్యాయాలు ఇవ్వలేదు. 33 జిల్లాలకు నవోదయ విద్యాలయాలు రావాలి. పదేండ్ల నుంచి అడుగుతున్నా ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. మరి నవోదయ పాఠశాల ఇవ్వని నాయకులు ఏ ముఖం పెట్టుకుని బీజేపీ మనల్ని ఓట్లు అడుగుతుది. వారికి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పకపోతే మనమీదనే దాడి చేస్తరు.
భైంసా ఎలా అభివృద్ధి చెందిందో మీరు చూస్తున్నారు. కులం, మతం లేదు. తెలంగాణ ప్రజలందరూ మన బిడ్డలే. దళిత సమాజం ఎప్పట్నుంచో వెనుకబడి ఉన్నారు. అణిచివతేకు గురయ్యారు. వారు సాటి మనషులు కారా..? దళితుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు ఉండేది. ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. ఈ దళిత బంధు స్కీం తెచ్చింది కేసీఆర్. తప్పకుండా ప్రతి దళిత కుటుంబానికి సాయం అందిస్తాం. దళితులు కూడా ఆలోచించి ఓటేయాలి.
భైంసా, ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్‌లో ముస్లింలు హిందువులు ఉన్నారు. వందల ఏండ్ల నుంచి కలిసి బతుకుతున్నాం. తాకులాటలు పెట్టి మతపిచ్చి లేపి భైంసా అంటేనే యుద్ధమన్నట్టు చిత్రీకరించి, తన్నుకు చస్తారని అబద్ధాలు చెప్పి ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేండ్లలో కర్ఫ్యూ లేదు. లాఠీ ఛార్జి లేదు. ఫైరింగ్ లేదు. ప్రశాంతంగా ఉన్నది తెలంగాణ. ఇలానే ప్రశాంతంగా ఉండాల్నా.. మతపిచ్చి మంటలతోటి నెత్తురు పారాలా..? మీరు ఆలోచించాలి. ఎవరి బతుకు వారు బతుకకా.. ద్వేషం పెట్టుకుని ఏం సాధిస్తాం. ఏమోస్తది. కలిసిమెలిసి బతకడంలోనే శాంతియుతమైన సహజీవనం ఉంటది. అందరం గొప్పగా బతుకగలుగుతాం. మన రాష్ట్రంలో ఉన్న అన్ని మతాలు, కులాల వారు కలిసి ముందుకు పోవాలి.
తెలంగాణను కాంగ్రెస్ 50 ఏండ్లు పరిపాలించింది.. మధ్యలో టీడీపీ ఉంది.. 10 ఏండ్ల నుంచి బీఆర్ఎస్ ఉంది. ఏ పార్టీ ఏం చేసిందో మీకు తెలుసు. దాన్ని చూసి మీరు నిర్ణయం చేయాలి. రైతుబంధు దండుగ అని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబారా అంటున్నాడు. రేవంత్ రెడ్డేమో కేసీఆర్ వేస్ట్‌గా 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు. మూడు గంటలు సరిపోతదని అంటున్నడు. ఈ రోజు భారతదేశంలో అన్నింటికి ఇండ్లకు, దుకాణాలకు, పరిశ్రమలకు, ఐటీకి, వ్యవసాయానికి 24 గంటలు మంచి కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ.
ఈ సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. ఎందువల్ల అంటే.. పక్కకే మహారాష్ట్ర బోర్డర్ ఉంది. రోజు పోయి వస్తరు ఏదో పని మీద. మహారాష్ట్ర రైతులు మన దగ్గర భూమి కొనుక్కొని ఇక్కడ బోర్లు వేసి అక్కడ పంటలు పండించుకుంటున్నారు. మహారాష్ట్రకు ఏం తక్కువైంది. మన హైదరాబాద్ కంటే పెద్దనగరం బొంబై ఉంది. మనం పదేండ్ల కింద రాష్ట్రం. వారు 70 ఏండ్ల కింద రాష్ట్రం అయింది. వారే మంచిగా ఉండాలి కదా. ఏం కారణం.
ఇవాళ మహారాష్ట్ర నుంచి లారీ వస్తే, కారులో వస్తే బోర్డర్‌లో దాబాలో చాయ్ తాగి తెలంగాణ ఎక్కడ ఉంది అనిడిగితే రోడ్డు నున్నగా వస్తదో అక్కడనుంచి తెలంగాణ అని చెబుతున్నారు. ఈ విషయం మీకు తెలుసు. పరిపాలన బాగుంటే ఇవన్నీ సాధ్యమవుతాయి. అవతల లైటు లేదు. ఇక్కడ 24 గంటలు కరెంట్ ఉంటంది. దీనికి కారణం ఏంది. కడుపు కొట్టుకుని, పట్టుదలతో, చిత్తశుద్ధితో, మొండి పద్దతిలో పని చేస్తున్నాం. అందుకే అన్ని సమస్యలను పరిష్కరించుకుంటున్నాం.
తెలంగాణ వచ్చే సమయానికి ఆగమాగం ఉండే. కరెంట్, సాగు, తాగు నీరు లేదు. వలపసలు పోయారు. ఈ తెలంగాణ ఎట్ల ముందుకు తీసుకుపోవాలి అని మూడు నాలుగు మాసాలు మేధావులతో మాట్లాడి ఎజెండా చేసుకున్నాం. 70 శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. వ్యవసాయాన్ని స్థీరికరించాలని నిర్ణయించాం. 24 గంటల కరెంట్ ఇవ్వాలని నిర్ణయించాం. నీళ్లకు ట్యాక్స్ లేదు. రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నాం. ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
ధరణి లేక ముందు పైరవీకారుల రాజ్యం.. లంచాల రాజ్యం ఉండే. ఒక పట్టా కావాలంటే ఆర్నేళ్లు, ఏడాది ఆర్డీవో ఆఫీసు చుట్టు తిరిగేది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక మండలాల్లోనే 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. మరో 10 నిమిషాల్లో పట్టా చేతికి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గ్యారెంటీగా ధరణిని తీసి బంగాళాఖాతంలో పారేస్తరట. ధరణి తీసేస్తే.. మళ్లీ దళారుల రాజ్యం వస్తది. లంచాలు అడుగుతారు. కానీ ఇవాళ రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోలు డబ్బులు హైదరాబాద్‌లో వేస్తే ఇవాళ మీ ఫోన్‌లు టింగ్ టింగ్‌న మోగుతున్నాయి. మధ్యలో దళారీ దరఖాస్తు లేదు. లంచం ఇచ్చేది లేదు. ఇది జరిగుతుంఉంది ఇప్పుడు. ధరణి తీసేస్తే మళ్లా అదే దళారీ రాజ్యం రావాల్నా.. ఇదే ప్రశాంత రాజ్యాం ఉండాల్నా..? అనేది ఆలోచించాలి.
మన దేశంలో ప్రజాస్వామ్యం వచ్చి 75 ఏండ్లు అవుతుంది. ఎన్నికలు రాగానే ఆగమాగం అవుతున్నారు. అబద్ధాలు చెప్పుడు, నిందలు వేయడం సహజమైంది. ప్రజాస్వామ్య ప్రక్రియకు రావాల్సిన పరిణితి మన దేశంలో రావడం లేదు. ఏ దేశంలో అయితే ప్రజాస్వామ్య పరిణితి వచ్చిందో ఆ దేశాలు బాగా పురోగతి చెంది ముందుకు పోతున్నాయి. ఎన్నికలు చాలా వస్తాయి. చాలా పోతాయి. ఓట్లు పడుతాయి. ఎవరో ఒకరు గెలుస్తరు. పార్టీకి ఒక్కరే నిలబడుతారు. బీఆర్ఎస్ తరపున విఠల్ రెడ్డి ఉన్నారు. వేరే పార్టీలో కూడా ఎవరో ఒకరు ఉంటారు. 30న ఓట్లు వేస్తరు. 3న లెక్క అయిపోతాయి. ఎవరో ఒకరు గెలుస్తరు. అది తప్పదు.
కానీ మీ బిడ్డగా తెలంగాణ తెచ్చిన నాయకుడిగా, బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నా.. ఎందంటే.. ఎన్నికల్లో ఒక వ్యక్తి నిలబడుతాడు. మంచి, చెడు, అతని గుణగణాలు ఆలోచించాలి. అంతే కాకుండా ఆ వ్యక్తి వెనుకాల ఏ పార్టీ ఉంది. పార్టీకి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఏందో మీకు తెలుసు. ప్రజలు, రైతుల గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించాలి. ఇవన్నీ మీరు విచారించి ఓటు వేయాలి. అలాంటప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతంది. విచక్షణ జ్ఞానంతో ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉంటే వజ్రాయుధం ఓటు. సరైన పార్టీకి ఓటేస్తేనే భవిష్యత్ సరైన పద్ధతిలో ఉంటుంది. లేదంటే వచ్చే ఐదేండ్లు బాధపడాలి.
అందుకే మీరందరూ నేను చెప్పే మాటలను గ్రామాల్లో చర్చ పెట్టాలి. పార్టీ వైఖరి, దృక్పథం, నడవడి గురించి ఆలోచించి పరిగణనలోకి తీసుకొని ఓటు వేయాలి. సరైన ప్రభుత్వం ఏర్పడితేనే మనం మంచిగా ఉంటాం. లేదంటే మనం దెబ్బతింటాం. ఒకసారి ఓటు చేతిలో నుంచి జారిపోతే చేసేదేమీ ఉండదు. ఐదేండ్ల దాకా ఏం చేయలేం. ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఓటు వేయాలి.
బాసర సరస్వతి దేవి కొలువైన ఈ పుణ్యభూమికి శిరస్సు వంచి నమసరిస్తున్నా. తెలంగాణలో గతంలో ఎప్పుడూ కూడా గోదావరి పుష్కరాలు జరగలేదు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పుష్కరాలు జరుపుకుంటున్నాం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. బాసర ఆలయం అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేశాం. ఆ పనులు జరుగుతున్నాయి. ఇంకా అవసరమతై మరిన్ని నిధులు మంజూరు చేస్తాను.
బీడీ కార్మికులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. దేశంలో 19 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో పెన్షన్ లేదు. మన దగ్గరనే బీడీ కార్మికులకు పెన్షన్ ఉంది. పెన్షన్లు పెంచుతాం. కొత్తవారికి కూడా ఇస్తాం. బీడీ కార్మికులకు కాదు.. టేకేదార్లు, ప్యాకింగ్ చేసేవారికి మంజూరు చేశాం. అందరికీ సహాయం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే తెలంగాణ ముందుకు పోతది. దయచేసి బీఆర్ఎస్‌ను గెలిపించి విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను.