KTR| 200రోజులైనా మృతదేహాలను వెలికితీయలేని అసమర్థ సర్కార్ : కేటీఆర్ ఫైర్

ఎస్ఎల్బీసీ సొరంగంలో చనిపోయిన ఎనిమిది మంది కార్మికులలో ఆరుగురు మృతదేహాలను అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం 200రోజులు దాటిపోయినా నేటికి వెలితీయలేదని..చనిపోయిన కార్మికుల కుటుంబాలకు పరిహారం కూడా చెల్లించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

KTR| 200రోజులైనా మృతదేహాలను వెలికితీయలేని అసమర్థ సర్కార్ : కేటీఆర్ ఫైర్

విధాత, హైదరాబాద్ : శ్రీశైలం ఎడమ కాలువ (SLBC Tunnel Collapse) సొరంగం కూలిన ఘటనలో చనిపోయిన ఎనిమిది మంది కార్మికుల(Worker Deaths)లో 200 రోజులు దాటినా..కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) నిర్లక్ష్యం వల్ల ఆరుగురి మృతదేహాలను ఇప్పటికీ వెలికితీయలేదని, బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా అందించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కూడా ఆయన ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగురు బాధితుల మృతదేహాలను కూడా వెలికితీయలేకపోయింది, కుటుంబాలకు ఎటువంటి పరిహారం కూడా చెల్లించలేదు” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ, కాంగ్రెస్ మధ్య అపవిత్ర బంధం?

కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎస్సెల్బీసీ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా పంపలేదని, ఒక్క ప్రశ్న కూడా ఎందుకు లేవనెత్తలేదని కేటీఆర్ ప్రశ్నించారు. “బీజేపీ బడే భాయ్ ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ చోటే భాయ్‌ని ఎప్పుడూ కాపాడుతున్నారు? ఇది ఎలాంటి అపవిత్ర బంధం?” అని కేటీఆర్ నిలదీశారు.

బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తాం

ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయి 200 రోజులు దాటినా ప్రభుత్వానికి పట్టడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజున, ఆ ఆరు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాము. ఆ ఆరుగురి ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తాము. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దానితో పాటు ఎస్సెల్బీసీ సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు మేము సమాధానాలు రాబడతాం” అని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ వాగ్దానం” అని చెప్పారు.