World Women Boxing Championship 2025| ప్రపంచ మహిళా బాక్సింగ్ లో స్వర్ణ విజేత భారత్

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్ జైస్మీన్ లాంబోరియా స్వర్ణ పతకం సాధించి సంచలనం సృష్లించారు. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ టోర్నీ చరిత్రలో ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఇదే పోటీల్లో నుపుర్‌ షెరోన్‌ (80 కేజీల పైన) రజితం, పూజారాణి (80 కేజీలు) కాంస్య పతకం సాధించడం విశేషం. 48కేజీల విభాగంలో మీనాక్షి హుడా కూడా ఫైనల్ కు చేరుకుంది. అయితే పురుషుల బాక్సింగ్ విభాగంలో మాత్రం భారత్ ఒక్క పతకం కూడా సాధించకపోవడం నిరాశ కల్గిచింది.

World Women Boxing Championship 2025| ప్రపంచ మహిళా బాక్సింగ్ లో స్వర్ణ విజేత భారత్

న్యూఢిల్లీ : ఇంగ్లాండ్ లివర్ పుల్ వేదికగా జరిగిన ప్రపంచ బాక్సింగ్ (World Women Boxing Championship 2025) పోటీల్లో భారత మహిళ రికార్డు విజయంతో సత్తా చాటింది. మహిళల 57 కిలోల విభాగంలో జరిగిన పోటీలో జైస్మీన్ లాంబోరియా(Jaismine Lamboria) స్వర్ణ పతక(Gold medal) విజేతగా నిలిచారు. ఫైనల్ లో జైస్మీన్ లాంబోరియా పోలండ్‌కు చెందిన జూలియా సెరెమెటా(Julia Seremeta)ను 4-1 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. ప్రత్యర్థి పారిస్ ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్​ జూలియాపై మెరుపు పంచ్ లు కురిపించిన లాంబోరియా పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్స్ పోటీల్లో భారత్​కు ఇదే తొలి గోల్డ్ మోడల్ కావడం విశేషం. ఫైనల్ పోటీ అనంతరం లాంబోరియా మాట్లాడుతూ 2024 పారిస్‌లో ఒలింపిక్స్​లో నిష్క్రమణించిన తర్వాత, నేను శారీరకంగా, మానసికంగా నా టెక్నిక్‌ను మెరుగుపరుచుకున్నానని తెలిపారు. ఒక సంవత్సరం పాటు నిరంతరం చేసిన కృషికి ఫలితం’ ఈ స్వర్ణ పతకం విజయం అని జైస్మీన్ చెప్పారు.

ఈ టోర్నీలో మహిళల విభాగంలోనే భారత్‌కు చెందిన నుపుర్‌ షెరోన్‌(Nupur Sheron 80 కేజీల పైన) రజితం(Silver medal), పూజారాణి (Pooja Rani 80 కేజీలు) కాంస్య పతకం(Bronze medal) సాధించడం విశేషం. 48కేజీల విభాగంలో మీనాక్షి హుడా(Meenakshi Huda) కూడా ఫైనల్ కు చేరుకుంది. అయితే పురుషుల బాక్సింగ్ విభాగంలో మాత్రం భారత్ ఒక్క పతకం కూడా సాధించకపోవడం నిరాశ కల్గిచింది.