CM Revanth Reddy At Medaram | మేడారంలో సీఎం రేవంత్ కు ఘన స్వాగతం..
సీఎం రేవంత్ మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొని 68 కేజీల బంగారం సమర్పించారు. డిజిటల్ ప్లాన్ విడుదల చేసి రూ.150 కోట్లు పనులు ప్రారంభించారు.

విధాత, వరంగల్ ప్రతినిధి: రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయానికి మంగళవారం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో చేరుకున్నారు. సీఎం రేవంత్ కు ఆదివాసీల సంప్రదాయ నృత్య రీతిలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎస్సి,ఎస్టీ, గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య , మహబూబాబాద్, వరంగల్ పార్లమెంటు సభ్యులు పొరిక బలరాం నాయక్, డా. కడియం కావ్య , ఎమ్మెల్సీలు, శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్.పి. శబరిష్, పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.