CM Revanthreddy | మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యత : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం కొడంగల్‌లో నిర్వహించిన అక్షయపాత్ర కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి అనంతరం అక్కడ నిర్వహించిన బహరంగ సభలో ఆయన మాట్లాడారు.

CM Revanthreddy | మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యత : సీఎం రేవంత్ రెడ్డి
విధాత, హైదరాబాద్ :
తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం కొడంగల్‌లో నిర్వహించిన అక్షయపాత్ర కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి అనంతరం అక్కడ నిర్వహించిన బహరంగ సభలో ఆయన మాట్లాడారు.  ప్రజాపరిపాలనలో మహిళల భూమిక అత్యంత కీలకమని చెప్పారు. ఆడబిడ్డల పెత్తనం ఉన్న ఇల్లు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం పలు పథకాలను ప్రారంభించినట్లు సీఎం వివరించారు.
మహిళా సంఘాలకు మొత్తం వెయ్యి ఆర్టీసీ బస్సులు అందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోలార్ ప్లాంట్లకు మహిళలను యజమానులుగా మారుస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం అందిస్తున్నామని గుర్తుచేశారు. అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. విద్యా రంగం, సాగునీటి ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కొడంగల్‌లో రూ.5 వేల కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. కొడంగల్‌ను అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చేలా సౌకర్యాలు కల్పిస్తామని సీఎం చెప్పారు. కొడంగల్‌లో ప్రతి ఎకరాకూ కృష్ణా నీటిని అందించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు.