Harish Rao : కేసీఆర్ చలవతోనే సీఎంగా రేవంత్ రెడ్డి

తెలంగాణ రాకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా? అని హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.

Harish Rao : కేసీఆర్ చలవతోనే సీఎంగా రేవంత్ రెడ్డి

విధాత : తెలంగాణ ఉద్యమనేత, మాజీ సీఎం కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని…తెలంగాణ రాకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా? అని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వయసున్న కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి అనుచిత విమర్శలు..దూషణలు చేస్తూ మాట్లాడొచ్చా? అని హరీష్ రావు మండిపడ్డారు. ఒక స్టేట్స్‌మెన్‌లా కేసీఆర్ మాట్లాడితే.. ఒక విధీ రౌడీలాగా రేవంత్ చిల్లర భాష మాట్లాడుతున్నాడన్నారు. కృష్ణా గోదావరి నది జలాలపైన, రాష్ట్ర సమస్యలపైన కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దూషణలకు దిగడం సిగ్గుచేటన్నారు. నగర కాలుష్య నివారణకు కేసీఆర్ ఫార్మాసిటీ భూసేకరణ చేస్తే.. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అక్కడికి వెళ్లి ఫార్మా సిటీ వద్దని చెప్పి..రైతులకు భూములు వాపస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాడన్నారు. ఇప్పడు రైతుల భూములు వాపసు ఇవ్వకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని.. దీనిని కేసీఆర్ ప్రశ్నించారన్నారు.

గురుకులాలకు నాణ్యమైన భోజనం పెట్టే దిక్కులేదని, నాలుగు నెలల నుంచి కాస్మోటిక్స్, మెస్ బిల్లులు లేవన్నారు. గ్రీన్ చానల్ ద్వారా బిల్లులు విడుదల చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు ఎక్కడ పోయాయన్నారు. విద్యార్థులకు సరిగ్గా భోజనం పెట్టని రేవంత్ రెడ్డిని చెట్టుకు కట్టేసి నీ లాగులో తొండలు జొరగొట్టాలని అన్న తక్కువేనన్నారు. పిల్లల బిల్లులకు కమిషన్లు రావనే బిల్లులు ఇవ్వడం లేదని హరీష్ రావు విమర్శించారు. విద్యాశాఖ మంత్రిగా, ఫెయిల్యూర్ సీఎంగా నువ్వే దీనికి బాధ్యత వహించాలన్నారు.
కొడంగల్ లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి గతంలో రేవంత్ రెడ్డి మాట తప్పాడని, ఆయను పార్టీలు మారుడు, శపథాలు చేసి తప్పుడు అలవాటేనని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి :

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రభాకర్ రావు కస్టడీలో కీలక పురోగతి
IRCTC Best Package: మిస్టికల్ కాశ్మీర్ న్యూ ఇయర్ స్పెషల్ ట్రిప్ కేవలం రూ. 35550 మాత్రమే