రేపు కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకోనున్నారు

హైదరాబాద్, సెప్టెంబర్ 3(విధాత): కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి గురువారం సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకోనున్నారు. లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న లింగంపల్లికుర్దు ఆర్&బి బ్రిడ్జ్ ను అలాగే బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నారు. అనంతరం కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను, జిఆర్ కాలనీని కూడా సందర్శించనున్నారు. అనంతరం కామారెడ్డి IDOC లో ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించి వరద నష్టంపై జిల్లా అధికారులతో సీఎం సమీక్షించనున్నారు.