కాంగ్రెస్ లో అంతర్గత విభేధాలు భగ్గుమంటున్నాయి. నల్లగొండలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కు మధ్య బహిరంగ విమర్శలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వనపర్తిలో సీనియర్ లీడర్ చిన్నారెడ్డికి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య, బాన్స్ వాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా ఏనుగు రవిందర్ రెడ్డి బహిరంగ విమర్శలు కొనసాగడం పార్టీలో వర్గపోరును బహిర్గతం చేసింది. ఇక అదిలాబాద్ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు, ఆయన వ్యతిరేక వర్గీయుల మధ్య రచ్చ కొనసాగింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సైతం తరుచూ ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నారు.
వరంగల్ లో కొండా సురేఖకు, ఇతర ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదు. ఇకపోతే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ పాత, కొత్త కాంగ్రెస్ ల మధ్య రచ్చ కొనసాగుతుంది. రోజురోజుకు పెరిగిపోతున్న అంతర్గత కలహాలు కొత్త నియోజకవర్గాలకు విస్తరిస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పరకాల సభలో మరోసారి రేవూరి ప్రకాశ్ రెడ్డిని గెలిపించాలంటూ చేసిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లా రాజకీయాలలో రచ్చ రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ పరకాల టికెట్ ఆశిస్తున్న మంత్రి కొండా సురేఖ మురళి కూతురు కొండా సుస్మిత బాహటంగా సీఎం రేవంత్ రెడ్డిపై మాటల తూటాలు పేల్చిన తీరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
పరకాల నుంచి పోటీ చేస్తా..గెలిచేది నేనే: సీఎం రేవంత్ రెడ్డికి సుస్మిత కౌంటర్
వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి కచ్చితంగా నేనే నిల్చుంటానని..నేనే గెలుస్తానని, కాంగ్రెస్ టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసి నీమీద, నీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి మీద గెలుస్తానని కొండా సుస్మిత సంచలన ప్రకటన చేశారు. పరకాలలో జరిగిన కొండా సురేఖ పుట్టినరోజు వేడుకలో కత్తితో కేక్ కట్ చేసిన కొండా సుస్మిత..అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నీకు దమ్ముంటే రెండేళ్ల తర్వాతా ఎన్నికలలో కాదు..ఇప్పుడే రేవూరి ప్రకాశ్ రెడ్డితో రాజీనామా చేయించి నువ్వు ప్రచారం చేయి…నేను గెలిచి చూపిస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డికి సుస్మిత సవాల్ విసిరారు. ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలని, 21ఏళ్లకే చట్టసభలలో పోటీ చేసే అవకాశం కల్పించాలని చెబుతావని…పరకాలలో మాత్రం డైపర్లు వేసుకుని నడవలేని స్థితిలో ఉన్న 80 ఏళ్ల వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాననడం హాస్యాస్పదం అని సుస్మిత ఎద్దేవా చేశారు.
నువ్వొచ్చినా, నీ అయ్యొచ్చినా, నీ తాతొచ్చినా పరకాల ఎమ్మెల్యేను నేనే అని రేవంత్ రెడ్డికి సుస్మిత స్పష్టం చేశారు. ఈసారి ఎమ్మెల్యే గెలిచి మరి ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటానని, త్వరలో పరకాలలో ఇల్లు కూడా కడుతున్నానని తెలిపారు. మా దయతోనే రేవూరి ప్రకాష్ రెడ్డి గత ఎన్నికల్లో పరకాలలో గెలిచాడని, కొండా మురళి స్వయంగా ప్రచారం చేసిన సంగతి మరువరాదన్నారు.
జగ్గారెడ్డి టికెట్ అధిష్టానం ఇస్తే..పరకాల టికెట్ నీవు ఇస్తావా..?
సంగారెడ్డికి వెళ్లి జగ్గారెడ్డికి టికెట్ అధిష్టానం చూసుకుంటుందని చెప్పిన నువ్వు..పరకాలకు వచ్చి రేవూరి ప్రకాశ్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని ప్రజలకు చెప్పడం ఏమిటని రేవంత్ రెడ్డిని సుస్మిత నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అధిష్టానం ఇస్తుందని, సీఎంలను అధిష్టానం ఎంపిక చేస్తుందని..నీవే టికెట్లు ఇచ్చేదైతే 119నియోజవర్గాలను నువ్వే ఇవ్వు..మరి అధిష్టానం ఎందుకని కొండా సుస్మిత సీఎం రేవంత్ పై విరుచకపడ్డారు. నా ఇలాకాకువచి రేవూరి ప్రకాశ్ రెడ్డిని గెలిపించమంటావా?…మాకు మీలాగా బ్రోకరిజం, ఊడిగం రాదు అని ప్రజల కోసం పనిచేయడం మాత్రమే వచ్చన్నారు. రేవంత్ రెడ్డిని కొడంగల్‌లో ప్రజలు ఒకసారి ఓడగొట్టారని, అలాంటిది పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని ఇప్పుడు ఎలా అంటావని, వైఎస్సార్ వంటి నాయకులు కూడా అలా చెప్పుకోలేదన్నారు. నీకు కాంగ్రెస్ సంస్కృతి ఒంట పట్టలేదు అని విమర్శించారు.
అచ్చ కాంగ్రెస్..పచ్చ కాంగ్రెస్ మధ్య వార్..
తెలంగాణలో అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ నడుస్తుందని, అసలు కాంగ్రెస్ సభ్యులు ఎవరు ఆనందంగా లేరని, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆనందంగా లేరని, కొండా మురళికి మోసం జరిగిందని సుస్మిత పేర్కొన్నారు. బీసీ ఎమ్మెల్యేలు…కొత్త ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి అపాట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, బీసీలను కొండా కుటుంబాలను తొక్కాలని చూస్తున్నావంటూ మండిపడ్డారు. వేం నరేందర్ రెడ్డి మూడేళ్లలో ఇచ్చిన సలహా ఏంటదని..నీ తమ్ముడు షెల్ కంపెనీ పెడితే రూ. 200 కోట్ల విలువగల భూమిని ధారాదత్తం చేశావని ఆరోపించారు. నీవు నీ తమ్ముళ్లు రాష్ట్రం మీద పడి తింటున్నారని రేవంత్ పై సుస్మిత నిప్పులు చెరిగారు. నీవు పీసీసీ చీఫ్ అవ్వడానికి సహాయపడ్డ దయాసాగర్ రావు, షబ్బీర్ అలీలకు ఇప్పుడు ఆయన అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు అన్నారు. ముఖ్యమంత్రి కాగానే నీకు కళ్ళు నెత్తికి ఎక్కినయా అని, పీసీసీ చీఫ్ కావడానికి నీకు సహాయం చేసిన మా నాన్న ఈరోజు నీకు కనిపించడంలేదా? అని సుస్మిత ప్రశ్నించారు. సీత దయాకర్ కాంగ్రెస్ కు ఏం చేసిందని చైర్మన్ పదవి ఇచ్చావని, ఎమ్మెల్సీ ఇస్తానని కొండా మురళికి ఎందుకు మోసం చేశావని రేవంత్ పై మండిపడ్డారు.
పొంగు ఎక్కువ సేపు పొంగదు..బీసీలు అంటే నీకు చులకనా..
రేవంత్ రెడ్డి నీతో పాటు ఉన్న పొంగు(మంత్రి పొంగులేటి) ఎక్కువ సేపు పొంగదు అని, నువ్వు ముఖ్యమంత్రివా లేదా ఆయన ముఖ్యమంత్రో తెలియడం లేదు అని సుస్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల సముదాయం నిర్మాణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫోటో, రేవంత్ రెడ్డి ఫోటో వేసుకున్నారు కానీ.. అక్కడ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటో వేయలేదు అని, బీసీలు అంటే అంత చులకననా మీకు అని..మా అమ్మ సహాయంతోనే రేవంత్ రెడ్డి ఆనాడు పీసీసీ అధ్యక్షుడు అయ్యాడని, నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ కావాలని మొదట కోరుకున్నది కొండా సురేఖ అవునా? కాదా? సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి అని సుస్మిత నిలదీశారు. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక మా ఇంటికి వచ్చి, మనకు 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తాను అని మా నాన్నకు చెప్పలేదా? అని ప్రశ్నించారు. మైసమ్మ, ఎల్లమ్మ దగ్గర ప్రమాణం చెయ్యి అని సవాల్ చేశారు.
నాకు కౌంటర్ ఇస్తే..ప్రెస్ క్లబ్ కు వచ్చి రేవంత్ కుటుంబం స్కామ్ లు అన్ని బయటపెడుతా
నా మాటలకు కౌంటర్ ఇస్తే ప్రెస్ క్లబ్ లో కూర్చోని రేవంత్ రెడ్డి భాగోతాలు అన్నీ బయటపెడతానని, నన్ను గెలికితే మీ అన్నదమ్ముల స్కాములు అన్నీ బయటపెడతానని, ఈరోజు నీ తమ్ముడి 200 కోట్ల భూ కుంభకోణం గురించి మాత్రమే మాట్లాడాను.. నాకు కౌంటర్ ఇస్తే మీ స్కాములు అన్నీ బయటపెడతానని సీఎం రేవంత్ రెడ్డికి సుస్మిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Big Statements by Congress Minister Konda Surekha garu’s daughter on CM Revanth …
1. Arrogance gone to Head after becoming CM..
2. Its TDP Congress in Telangana, Original Congress leaders are upset..
3. CM is afraid, he is using Intelligence Dept against Ministers.
4. Rs.200… pic.twitter.com/pG8hRonPtE— Dr.Krishank (@Krishank_BRS) August 19, 2026
