CM Revanth Reddy | మూడు పార్టీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలతో భేటీ అయ్యారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, చివరి రోజు ప్రచార సరళిపై చర్చించారు

CM Revanth Reddy | మూడు పార్టీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చ

విధాత: సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలతో భేటీ అయ్యారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, చివరి రోజు ప్రచార సరళిపై చర్చించారు. ఈ ఉప ఎన్నికలో ఈ నెల 27న పోలింగ్ జరుగనున్న నేఫథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఆయా పార్టీలకు చెందిన ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.