గవర్నర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ … కీలక అంశాలపై చర్చలు
హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. సీఎం రాజ్‌భవన్‌లోనే గవర్నర్‌తో భోజనం చేశారు.
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. సీఎం రాజ్‌భవన్‌లోనే గవర్నర్‌తో భోజనం చేశారు. దాదాపు రెండుగంటల పాటు సాగిన వారి సమావేశంలో పెండింగ్ బిల్లుల ఆమోదం..నామినేటెడ్ ఎమ్మెల్సీల నియామకం, మంత్రివర్గం విస్తరణ అంశాలతో పాటు త్వరలో నిర్వహించాల్సిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కీలక చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది. యూనివర్సిటీల్లో వీసీల నియామకం, అలాగే ఏపీతో ఉమ్మడి ఆస్తులు, అప్పుల అంశాలు కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. కాగా ఆగస్టు 15వ తేదీన ఖైదీల విడుదలకు సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, అక్టోబర్ 2 గాంధీ జయంతి, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను గవర్నర్ అనుమతితో విడుదల చేస్తుంటారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram