పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణ వేగం పెంచండి: సీఎం రేవంత్ రెడ్డి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల సహా ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి పాలమూరు(మహబూబ్ నగర్) జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించాలని ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలయినంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశాలుఇచ్చారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామన్నారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ భేటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి, రాకేశ్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్లకృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితి పెంపు
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram