సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశం లో పాల్గొన్న : సీఎం రేవంత్ రెడ్డి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్ష సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు.జిల్లా లోని అన్ని ప్రాజెక్టుల కింద భూసేకరణ ఆర్ అండ్ ఆర్ చెల్లింపులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

పెండింగ్ బిల్లుల చెల్లింపున కు వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.పాలమూరు- రంగారెడ్డి మినహా అన్ని ప్రాజెక్టు పనులను 18 నెలల్లో పూర్తి చేయాలని సీఎం సూచించారు.

ప్రతి ప్రాజెక్టు వారిగా సూక్ష్మ స్థాయిలో స్టేటస్ రిపోర్ట్ తయారు చేయాలని, మండలం ,గ్రామాల వారీగా ఆయకట్టు వివరాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి ప్రాజెక్టుకు స్టేటస్ రిపోర్ట్ ఉండాలని,ఆయా ప్రాజెక్టు కింద కొత్త ప్రతిపాదనలను న్యాయపరమైన వివాదాలకు అవకాశం లేకుండా రూపొందించాలన్నారు.
నెలకోసారి ప్రాజెక్టు ల విషయం లో సమీక్ష నిర్వహించడం జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. అధికారులు అన్ని ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో సందర్శించి పూర్తి నివేదికలు ప్రభుత్వనికి అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా నీటిపారుదల అధికారులను ఆదేశించారు.ఆర్ డి ఎస్ ( రాజోలి బండ లిఫ్ట్ ఇరిగేషన్ ) కు సంబంధించి కర్నాటక, ఏపీ రాష్ట్రాలతో
చర్చించాల్సిన అంశాలను రూపొందించాలని,
తమ్మిళ్ల లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై ప్రణాళిక రూపొందించాలని,

కోయిల్‌సాగర్ ప్రాజెక్ట్ సామర్థ్యం పెంపుపై ప్రతిపాదన తయారు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశం లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజానర్సింహా, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, మేఘా రెడ్డి, వంశీ కృష్ణ పాల్గొన్నారు.
……………………………
…………………………..