CM Revanth Reddy : డెయిరీ కార్పోరేషన్ పనితీరు భేష్
విజయ డెయిరీని లాభాల్లోకి తీసుకొచ్చిన గుత్తా అమిత్ రెడ్డి పనితీరు అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు.

విధాత, హైదరాబాద్ : ప్రతినెల రూ.10కోట్ల మేరకు నష్టాలలో సాగుతున్న విజయ డెయిరీని ఏడాదిలోని లాభల్లోకి తీసుకొచ్చిన తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పనితీరు అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. తెలంగా డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్(విజయ డెయిరీ) చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా అమిత్ రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంను శాలువతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.
విజయ డెయిరీని లాభాల బాట పట్టించిన స్ఫూర్తితో మరింత పట్టుదలతో పని చేసి..వచ్చిన లాభాలను సంస్థ ద్వారా పాడి రైతుల సంక్షేమానికి ఖర్చు చేయాలని ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి చైర్మన్ అమిత్ రెడ్డికి సూచించారు. మరో సంవత్సరం కాలంలో విజయ తెలంగాణ డైరీ అమ్మకాలను పెంచి, సమాఖ్యను పూర్తి లాభల్లోకి తీసుకుని వస్తానని, అందుకు పక్క ప్రణాళికతో పని చేస్తున్నామని గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు.