Revanth Reddy| కొండా సురేఖ- పొంగులేటి వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్!

మంత్రులు కొండా సురేఖ-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల మధ్య నెలకొన్న వివాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాల టాక్. ముఖ్యంగా మంత్రుల మధ్య వరుస వివాదాలు రచ్చకెక్కడంతో మంత్రివర్గం ప్రాథమిక సూత్రం సమిష్టి బాధ్యత కాస్తా అపహాస్యంగా మారిపోయి తన ప్రతిష్టను దెబ్బతీసేదిగా ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల పంచాయతీపై సీరియస్ గా ఫోకస్ చేశారంటున్నారు.

Revanth Reddy| కొండా సురేఖ- పొంగులేటి వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్!

విధాత : మంత్రులు(Ministers) కొండా సురేఖ(Konda Surekha)-పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy)ల మధ్య నెలకొన్న వివాదాన్ని(Dispute)సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్ గా తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం నెలకొంది. మేడారం జాతరలో మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి చేపట్టిన పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోగా..ఈ పనుల టెండర్లను వివాదస్పదం చేసి మంత్రులు రచ్చకెక్కడం పట్ల రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తుంది. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటిల మధ్య నెలకొన్న వివాదంపై సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హై కమాండ్ కి వివాదానికి సంబంధించిన పూర్తి నివేదికను రేవంత్ రెడ్డి పంపించినట్లుగా సమాచారం. అదే విధంగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య వరుసగా కొనసాగుతున్న అంతర్గత వివాదాలను సైతం హైకమాండ్ కు వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఓ నివేదికను అందించారని కాంగ్రెస్ వర్గాల కథనం.

మంత్రుల కట్టడికి సీఎం ఫోకస్

మేడారం జాతర లోపు పనులు పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిందని..ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనుల పైన వివాదం చేయడంపై సీఎం ఆగ్రహంగా ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మంత్రుల మధ్య వరుస వివాదాలు రచ్చకెక్కడంతో మంత్రివర్గం ప్రాథమిక సూత్రం సమిష్టి బాధ్యత కాస్తా అపహాస్యంగా మారిపోయి తన ప్రతిష్టను దెబ్బతీసేదిగా ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల పంచాయతీపై సీరియస్ గా ఫోకస్ చేశారంటున్నారు. మొన్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శాఖలో మరో మంత్రి జోక్యంతో పాటు..నిన్న పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య నెలకొన్న వివాదం..ఇప్పుడు కొండా సురేఖ-పొంగులేటిల మధ్య వివాదంతో మంత్రివర్గం ప్రతిష్ట మసకబారిపోతుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల పంచాయతీని కట్టడి చేసి..మంత్రివర్గంపై తన అదుపు లేదన్న అపవాదు చెరిపేసుకుని..మంత్రులపై పట్టు సాధించే విషయమై సీరియస్ గా దృష్టి పెట్టారంటున్నారు. అసలే ఓ వైపు బీసీ రిజర్వేషన్లు, బనకచర్ల వివాదాలు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, డీసీసీ అధ్యక్షుల ఎన్నికలు వంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంది. ఈ పరిణామాల మధ్య మంత్రుల పంచాయతీ ప్రభుత్వానికి మరో తలనోప్పిగా మారడంతో ఈ వ్యవహారానికి వీలైనంత త్వరగా చెక్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.