విధాత, హైదరాబాద్ : ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సును ఈ ఏడాది సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్నట్లు సీఎం ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. గ్లోబల్ అర్టిఫిషియల్ సదస్సు లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తో పాటు ఐటీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్లోబల్ అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సదస్సును హైదరాబాద్ వేదికగా నిర్వహించనుండటం గర్వంగా ఉందన్నారు. సాంకేతిక ఆవిష్కరణలతో మన రాష్ట్రాన్ని మరింత ముందంజలో ఉంచేందుకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కృత్రిమ మేథా రంగ నిపుణులు, ఐటీ ఆవిష్కర్తలెందరినో ఈ సందర్భంగా హైదరాబాద్‌కు ఆహ్వానిస్తు న్నామని చెప్పారు. ‘మేకింగ్ ఏఐ వర్క్ ఎవ్రీ వన్..’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది సదస్సును ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాజానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో.. ఎలా సాధికారత కల్పిస్తుందో అన్వేషించటమే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతుందని వెల్లడించారు. దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈ సదస్సు ఏఐ పరిజ్ఞానంతో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, ప్రపంచంలో ఉన్న సవాళ్లను పరిష్కరించేందుకు వీలుగా ఏఐ సామర్థ్యాలను అన్వేషించేందుకు ఈ సదస్సు కీలక వేదికగా ఉపయోగ పడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జరిగే ఈ సదస్సు అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ భవిష్యత్తుకు, కొత్త ప్రాజెక్టులకు నాంది పలుకనుందన్నారు. ఈ సదస్సుకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ ను త్వరలోనే ప్రారంభించనున్నామని తెలిపారు.
C.M. REVANTH REDDY | సెప్టెంబర్ 5,6తేదీల్లో హైదరాబాద్‌లో గ్లోబల్ అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సదస్సు … లోగో ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సును ఈ ఏడాది సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్నట్లు సీఎం ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు