CM Revanth Reddy | ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పిలుపుతో బుధవారం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అధిష్టానం పెద్దలతో రాష్ట్ర కేబినెట్ విస్తరణ..పీసీసీ నూతన అధ్యక్షుడి నియామకంపై ఆయన కీలక చర్చలు జరుపనున్నారు

CM Revanth Reddy | ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి

మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ చీఫ్‌పై కీలక చర్చలు

విధాత : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పిలుపుతో బుధవారం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అధిష్టానం పెద్దలతో రాష్ట్ర కేబినెట్ విస్తరణ..పీసీసీ నూతన అధ్యక్షుడి నియామకంపై ఆయన కీలక చర్చలు జరుపనున్నారు. రెండు రోజులుగా ఆయన ఆయా అంశాలకు సంబంధించి హైకమాండ్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు.

బుధవారం ఉదయం హైకమాండ్ పిలుపుతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కేబినెట్‌లో ఎవరెవరిని తీసుకోవాలి..శాఖల కేటాయింపుతో పాటు పీసీసీ చీఫ్ నియామకంపై ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ దిశా నిర్ధేశం చేయనుంది. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలుంటాయన్నదానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.