CM Revanth Reddy | ఆమెరికా నుంచి వచ్చాకే 2లక్షల రూణమాఫీ … సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
2లక్షల రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుర్తిలో మాజీ కేంద్ర మంత్రి దివంగత సూదిని జైపాల్‌రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేసి బహిరంగ సభలో ప్రసంగించారు.

విధాత, హైదరాబాద్ : 2లక్షల రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుర్తిలో మాజీ కేంద్ర మంత్రి దివంగత సూదిని జైపాల్‌రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేసి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీపై మాట్లాడుతూ రైతు రుణమాఫీలో ఇప్పటికే 1లక్ష వరకు రుణమాఫీ పూర్తి చేశామని, జూలై 31 లోపు రెండో విడత కింద రూ.1లక్ష 50వేల రుణమాఫీ చేసి రైతు రుణం తీర్చుకుంటామని కల్వకుర్తి గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నాన్నారు. అయితే ఆగస్ట్ 2 నుండి 14 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నానని.. నేను తిరిగి వచ్చాక ఆగస్ట్ నెలలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దీంతో 2లక్షల రుణమాఫీ ఇంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగా ఆగస్టు 15వ తేదీలోగా పూర్తవుతుందా లేదా అన్నదానిపై సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి. అయితే మొత్తం మీద ఆగస్టు నెలలోనే 2లక్షల రుణమాఫీ పూర్తవుతుందన్న భరోసా మాత్రం మిగిలింది.