Global Summit | అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలి : సీఎం రేవంత్
రంగారెడ్డి జిల్లాలోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 8,9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
విధాత, హైదరాబాద్ :
రంగారెడ్డి జిల్లాలోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 8,9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పుట్టపర్తి నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ కి చేరుకున్న సీఎం పనులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో సదస్సు నిర్వహణకు సంబంధించి సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. 1300 ఎకరాల్లో సదస్సు నిర్వహిస్తున్నట్లు.. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని అధిరులకు సూచించారు.
గ్లోబల్ సమ్మిట్‌కుప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతారని.. అలాగే, వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్లు పాల్గొనే అవకాశం కూడా ఉందని సీఎం తెలిపారు. పాస్ లు లేకుండా ఎవరిని సదస్సుకు అనుమతించకూడాదని అధికారులను ఆదేశించారు. సదస్సులో పెట్టుబడులు భూకేటాయింపులు లాంటి అనేక అంశాలపై చర్చలు జరగుతాయన్నారు. సమ్మిట్ కు శాఖల వారికిగా అధికారులకు ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram