విధాత:నల్లగొండ జిల్లా,మిర్యాలగూడ లో.. విద్యుత్, రవాణా శాఖ అధికారుల మధ్య కోల్డ్ వార్.బకాయిలు చెల్లించకపోవడంతో RTO కార్యాలయానికి నిలిచిన విద్యుత్ సరఫరా.దీనికి ప్రతిగా.. విద్యుత్ అధికారులు, సిబ్బంది వాహనాలను రవాణాశాఖ అధికారి సీజ్ చేశారు.అయితే రీఛార్జ్ మీటర్లకు విద్యుత్ పునరుద్ధరణ తమ చేతిలో లేదంటున్న విద్యుత్ అధికారులు సిబ్బంది.రవాణాశాఖ అధికారుల వైఖరికి నిరసనగా విద్యుత్ సిబ్బంది మిర్యాలగూడ మొత్తం కరెంటు సరఫరా నిలిపివేసి.. నిరసన వ్యక్తం చేశారు,దీంతో మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రతిగా పాత బస్టాండ్ లో కరెంటు బిల్లుల కార్యాలయాన్నిమున్సిపల్ సిబ్బంది జప్తు చేశారు.