Dharmapuri Srinivas | కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ గుండెపోటుతో మృతి
Dharmapuri Srinivas | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Dharmapuri Srinivas | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డీఎస్ మృతిపట్ల కాంగ్రెస్ పార్టీతో ఆయా పార్టీలకు చెందిన నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పని చేశారు. పీసీసీ చీఫ్‌గా కూడా ఆయన సేవలందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2023 ఎన్నికల కంటే ముందు డీఎస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీఎస్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్‌గా పని చేశారు. చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. అరవింద్ బీజేపీ నాయకుడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram