ప్రత్యేక హామీలతో కాంగ్రెస్ తెలంగాణ లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టో
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేసింది. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి డి.శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, రోహిన్ రెడ్డిలు

విడుదల చేసిన ఇంచార్జి దీపాదాస్ మున్షీ…మంత్రి శ్రీధర్‌బాబు
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేసింది. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి డి.శ్రీధర్‌బాబు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, రోహిన్ రెడ్డిలు మ్యానిఫెస్టో విడుదల చేశారు. 23ప్రధాన హామీలతో కూడిన మ్యానిఫెస్టోలో మరికొన్ని హామీలు కూడా కాంగ్రెస్ ప్రకటించింది. ఏఐసీసీ విడుదల చేసిన పాంచ్ న్యాయ్ ఎన్నికల మ్యానిఫెస్టోకు అదనంగా, అనుబంధంగా ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ హామీలను అమలు చేస్తారు. హైదరాబాద్ మహానగరానికి ఐటీఐఆర్ ప్రాజెక్టు పునఃప్రారంభించడంతో పాటు రాష్ట్ర విభజన చట్టం హామీలు కాజీపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, హైదరాబాద్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం), హైదరాబాద్, విజయవాడ హైవేలో రాపిడ్ రైల్వే సిస్టం, మైనింగ్ యూనివర్సిటీ వంటి హామీల సాధనపై హామీ ఇచ్చారు.
ఐదు గ్రామాలు తిరిగి తెలంగాణలోకి
భద్రాచలం దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న, ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయడం, పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా వంటి హామీలను తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కోంది. నీతి అయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటు, కొత్త ఎయిర్ పోర్టులు, రామగుండం, మణుగూరు రైల్వే లైన్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో రైలు కనెక్టివిటీ పెంచనున్నట్లు పేర్కొన్నారు. 4 కొత్త సైనిక్ స్కూళ్లు, కేంద్రీయ విశ్వ విద్యాలయాలు పెంపు, నవోదయ విద్యాలయాల రెట్టింపు , జాతీయ స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, నేషనల్ ఎవిగేషన్ యూనివర్సిటీ, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ క్యాంపస్, ఐసీఎంఆర్ పరిధిలో అడ్వాన్స్డ్ మెడికల్ అండ్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు నేరుగా గ్రామ పంచాయితీలకే ఇవ్వనున్నట్లు హామీలిచ్చారు.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్, కల్చరల్ ఎంటర్ టైన్మెంట్ హబ్, మేడారం జాతరకు జాతీయ హోదా, డ్రై ఫోర్ట్, హైదరాబాద్లో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్తు సిస్టమ్ ఏర్పాటుచేస్తామని కాంగ్రెస్ హామీలిచ్చింది.