Foreign Universities | విదేశీ వర్సిటీ క్యాంపస్ లలో 5.6 లక్షల మంది విద్యార్థులకు అడ్మిషన్లు
వచ్చే రెండు దశాబ్ధాలు విదేశీ విశ్వ విద్యాలయాలు భారత్ లో అంతర్జాతీయ స్థాయిలో శిక్షణనిస్తాయని, 5.6 లక్షల మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందచేస్తాయని డెలాయిట్ ఇండియా, నైట్ ఫ్రాంక్ ఇండియా సంయుక్త నివేదిక వెల్లడిస్తున్నది.
- 113 మిలియన్ డాలర్ల విదేశీ మారకం ఆదా
- వీసా నిబంధనలు, పోస్టు స్టడీ వర్క్ మార్పులతో ఇబ్బందులు
- డెలాయిట్ ఇండియా, నైట్ ఫ్రాంక్ ఇండియా సంయుక్త నివేదిక
విధాత, నేషనల్ డెస్క్:
Foreign Universities | గడచిన దశాబ్ధకాలంగా విద్యార్థులు విదేశీ విద్య కోసం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, రష్యా, సింగపూర్, చైనా వంటి దేశాలకు వెళ్తున్నారు. విదేశీ యూనివర్సిటీలను భారత్ లో ఏర్పాటు చేస్తే 113 బిలియన్ డాలర్లు విదేశీ మారకం ఆదా అవుతాయని, విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం కూడా తగ్గనున్నది. వచ్చే రెండు దశాబ్ధాలు విదేశీ విశ్వ విద్యాలయాలు భారత్ లో అంతర్జాతీయ స్థాయిలో శిక్షణనిస్తాయని, 5.6 లక్షల మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందచేస్తాయని డెలాయిట్ ఇండియా, నైట్ ఫ్రాంక్ ఇండియా సంయుక్త నివేదిక వెల్లడిస్తున్నది. భారతదేశంలో అవకాశాలు విదేశీ విశ్వ విద్యాలయాల దృష్టి (గ్లోబల్ యూనివర్సిటీస్ ఐ ఇండియా అపార్చునుటీ) పేరుతో నివేదిక రూపొందించారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరణ రీతులు, భారత్ లో ప్రభుత్వ రెగ్యులేటరీ విధానం, రియల్ ఎస్టేట్ రంగాన్ని పరిగణనలోకి తీసుకుని భారత్ లో విదేశీ విశ్వ విద్యాలయాలు తమ క్యాంపస్ లు ఏర్పాటు చేయనున్నాయి.
భారత్ లో ఉన్నత విద్య అడ్మిషన్లలో ముందున్నదని, 53 మిలియన్ల విద్యార్థులు తమ పేర్లను పలు విద్యా సంస్థల్లో నమోదు చేసుకోగా, 7.6 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. అభివృద్ధి అయిన దేశాలలో ఉన్నత విద్య కోసం 80 శాతం మంది తమ పేర్లను నమోదు చేసుకుంటుండగా భారత్ లో మాత్రం అది 34 శాతం మాత్రమే ఉన్నది. గడచిన కొద్ది రోజులుగా కొన్ని దేశాలలో వీసా నిబంధనలు కఠినం చేయడం, విశ్వ విద్యాలయాలకు గ్రాంట్లు నిలిపివేయడం, వివక్ష చూపించడం, ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో మార్పులు, చదువు పూర్తయిన తరువాత ఉపాధి అవకాశాలను కుదించడం వంటి చర్యలతో ముఖ్యంగా భారత విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ లోనే విదేశీ విశ్వ విద్యాలయాల క్యాంపస్ ల విస్తరణకు ప్రాముఖ్యత ఏర్పడింది 2035 కల్లా అడ్మిషన్లు 50 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నది. దీంతో విద్యార్థుల నమోదు 72 మిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుదల తరువాత వీసా నిబంధనలు కఠినం చేసి, స్టడీ వర్క్ కోసం విదేశాలకు వెళ్లకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నది.
భారత దేశంలో విదేశీ యూనివర్సిటీల స్థాపనపై జాతీయ విద్యా విధానం – 2020 లో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. విదేశీ విద్యా సంస్థలు తమ క్యాంపస్ లను స్వతంత్రంగా లేదా సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటు చేసుకునేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ)లు అనుమతించాయి. ఇప్పటికే 18 విదేశీ విశ్వ విద్యాలయాలు రిజిస్ట్రేషన్, లైసెన్స్ ల కోసం యూజీసీ, ఐఎఫ్ఎస్సీఏ కు దరఖాస్తులు కూడా చేసుకున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని గిఫ్ట్ సిటీలో డీకిన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వొల్లొంగాంగ్ లు తమ క్యాంపస్ లను ఏర్పాటు చేశాయి. గురుగ్రామ్ లో సౌతాంఫ్టన్ యూనివర్సిటీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. దేశంలోని 40 నగరాలలో ప్రతిభ, మౌలిక సదుపాయాలు, అనుసంధానత, పరిశోధన, గ్లోబల్ బిజినెస్ కనెక్టివిటీలను పరిగణనలోకి తీసుకుని వర్సిటీల క్యాంపస్ లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. న్యూఢిల్లీ ఇప్పటికే సిద్ధంగా ఉండగా, బెంగళూరు, ముంబై మహా నగరాలు కూడా సంసిద్ధంగానే ఉన్నాయి. ఛండీ గఢ్ తో పాటు కొచ్చి నగరాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. క్యాంపస్ ల ఏర్పాటుకు ముందు నగరాలలో రియల్ ఎస్టేట్, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేస్తున్నాయి. 2040 నాటికి 19 మిలియన్ల చదరపు అడుగుల వైశాల్యం ఉన్న వసతి సదుపాయం అవసరం ఉండనున్నది. కొత్తగా అందుబాటులోకి వచ్చే వసతిలో అత్యుత్తమ విద్యను అందించేందుకు మౌలిక సదుపాయాలు అనగా విద్యా బోధన, పరిశోధన, విద్యార్థులకు బస సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రపంచ స్థాయి విదేశీ విద్యా బోధన భారత్ లోనే అందించడం ద్వారా సుమారు 113 బిలియన్ డాలర్లు ఆదాయ అవుతాయని నివేదికలో అంచనా వేశారు.
Read Also |
Cold Wave | వామ్మో చలి పులి.. కనిష్ఠ స్థాయికి పడిపోతున్న ఉష్టోగ్రతలు..!
Heartbreaking Viral Video | 54 ఏళ్ల ఎడబాటు తర్వాత భర్త మళ్లీ కనిపించినప్పుడు భార్య భావోద్వేగం..
Bengaluru Cyber Crime : బెంగళూరు లో ప్రతిరోజు రూ.5.45 కోట్ల డిజిటల్ మోసం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram