KA Paul | నా చారిటీని రద్ధు చేయించాలని కుట్ర.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
తన చారిటీని రద్ధు చేయించాలని కొంతమంది కుట్రతో చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని శనివారం

విధాత, హైదరాబాద్ : తన చారిటీని రద్ధు చేయించాలని కొంతమంది కుట్రతో చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని శనివారం ఆయన సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ నా చారిటీ ద్వారా సుమారు 53 వేల మందికి ఉచితంగా అన్నం పెట్టి కడుపు నింపానని చెప్పారు. భూములను లాక్కునేందుకు తమపై దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని, చారిటీ రద్దు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.