• Telugu News
  • /Telangana

ఐబొమ్మలో సినిమాలు చూశాను… సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఐబొమ్మ వెబ్‌సైట్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్న నేపథ్యంలో, ఈ కేసు నడుమ కనిపిస్తున్న వ్యవస్థల వైఫల్యాలను ఎత్తిచూపారు.

Reported by: chinna | తెలంగాణ‌ | Nov 30, 2025, 3:57 pm IST
Read Time: 3 mins
ఐబొమ్మలో సినిమాలు చూశాను… సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

విధాత, హైదరాబాద్ :
సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఐబొమ్మ వెబ్‌సైట్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్న నేపథ్యంలో, ఈ కేసు నడుమ కనిపిస్తున్న వ్యవస్థల వైఫల్యాలను ఎత్తిచూపారు. తిరుపతి లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రముఖ సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారంపై స్పందించారు. “నేను కూడా ఐబొమ్మలోనే సినిమాలు ఫ్రీగా చూశాను. ఆరేడు వందలు పెట్టి ఎలా చూస్తాను?” అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆర్థికస్థితి, వినోదపు ఖర్చులు, మార్కెట్ రేట్లు అన్నీ పరిగణలోకి తీసుకుంటే పైరసీ ఎందుకు ఉధృతమవుతుందో ప్రభుత్వమే ఆలోచించాలని ఆయన సూచించారు.

రవి వంటి తెలివైన యువకులు పైరసీ నెట్‌వర్క్‌లోకి ఎందుకు వెళ్లాల్సి వస్తోందని ఆయన ప్రశ్నించారు. “అద్భుతమైన తెలివి, సామర్థ్యాలు ఉన్న రవి ఎలా ఇలాంటి దారిలోకి వెళ్లాడు? దీనికి కారణం వ్యక్తి కాదు… వ్యవస్థల లోపాలు” అని వ్యాఖ్యానించారు. విద్య, ఉపాధి, డిజిటల్ రంగంలో పర్యవేక్షణ వంటి కీలక అంశాలలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నారాయణ ఆరోపించారు. వ్యవస్థ సరిచేయకపోతే ఇలాగే మరిన్ని ‘రవిలు’ పుట్టుకొస్తారని హెచ్చరించారు.

అలాగే, “ఒక హిడ్మాను చంపితే వెయ్యి హిడ్మాలు పుడతారని చెప్పారు. పైరసీని పూర్తిగా ఎదుర్కోవాలంటే ప్రజలకు అందుబాటులో ఉండే చట్టబద్ధ వ్యవస్థలు, ప్రభుత్వ పర్యవేక్షణ అన్నీ మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.నారాయణ ఈ వ్యాఖ్యలతో పైరసీ సమస్య కేవలం చట్టపరమైనది కాదు, సామాజిక-ఆర్థిక సమస్య కూడా అన్న కోణాన్ని ముందుకు తెచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.