TG TET 2024-II | టెట్ అభ్యర్థులకు కీలక అప్డేట్.. దరఖాస్తుల స్వీకరణ ఆలస్యం..
సాంకేతిక కారణాలతో టెట్ దరఖాస్తుల స్వీకరణను ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు అధికారులు మంగళవారం అధికారికంగా ప్రకటించారు.

TG TET 2024-II | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించిన సంగతి తెలిసిందే. కానీ సాంకేతిక కారణాలతో టెట్ దరఖాస్తుల స్వీకరణను ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు అధికారులు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.