Real Estate | హౌసింగ్ బోర్డు స్థలాలకు డిమాండ్.. గచ్చిబౌలిలో రూ. 33 కోట్లకు ఒక ప్లాట్ కొనుగోలు
Real Estate | రాజధాని పరిసర ప్రాంతాల్లోని హౌజింగ్ బోర్డు( Housing Board )కు చెందిన భూముల బహిరంగ వేలంలో మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి.

Real Estate | హైదరాబాద్ : రాజధాని పరిసర ప్రాంతాల్లోని హౌజింగ్ బోర్డు( Housing Board )కు చెందిన భూముల బహిరంగ వేలంలో మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి. గచ్చిబౌలి( Gachibowli ) ప్రాంతంలోని ఒక కమర్షియల్ ప్లాట్( Commercial Plot ) ను ఏకంగా రూ. 33 కోట్లకు కొనుగోలు చేయడానికి ముందుకు రాగా, మరో చోట రూ. 13.51 కోట్లు పలికింది. నగరంలోని చింతల్, గచ్చిబౌలి, నిజాంపేట( Nizampet ) తదితర ప్రాంతాల్లో వివిధ రకాలైన ప్లాట్లకు సోమవారం నాడు హౌజింగ్ బోర్డు అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు.