Telangana Womens University | తెలంగాణ మహిళా యూనివర్సిటీ ఇంఛార్జి వీసీగా ధ‌నావత్ సూర్య

Telangana Womens University | తెలంగాణ మ‌హిళా యూనివ‌ర్సిటీ( Telangana Womens University ) ఇంఛార్జి వీసీగా ధ‌న‌వాత్ సూర్య( Dhanavath Surya ) నియామ‌కం అయ్యారు.

  • By: raj |    telangana |    Published on : Oct 16, 2024 9:12 AM IST
Telangana Womens University | తెలంగాణ మహిళా యూనివర్సిటీ ఇంఛార్జి వీసీగా ధ‌నావత్ సూర్య

Telangana Womens University | హైద‌రాబాద్ : తెలంగాణ మ‌హిళా యూనివ‌ర్సిటీ( Telangana Womens University ) ఇంఛార్జి వీసీగా ధ‌న‌వాత్ సూర్య( Dhanavath Surya ) నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు విద్యాశాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ బుర్రా వెంక‌టేశం ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌స్తుతం ధ‌నావ‌త్ సూర్య‌.. ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆర్ట్స్ క‌ళాశాల( Arts College ) తెలుగు విభాగంలో ప్రొఫెస‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.

ఇక మ‌హిళా యూనివ‌ర్సిటీ పేరును చాక‌లి ఐల‌మ్మ మ‌హిళా యూనివ‌ర్సిటీ( Chakali Ilamma Womens University )గా మారుస్తూ కాంగ్రెస్ కేబినెట్ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉండగా గత కేసీఆర్‌ సర్కారు 2022-23లో కోఠి మహిళా కాలేజీని వర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేసి ‘తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం’ పేరును ఖరారు చేసి, 100 కోట్ల నిధులను ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. రెండేండ్లుగా వర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.