తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలకు ఏర్పాట్లు
సీఎస్ శాంతికుమారి ఆదేశాలు
విధాత, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించనున్నారు. ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధశాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram